English   

రాజమౌళి మరో మెగా మల్టీస్టారర్... RRR తర్వాత...

Rajamouli Multi Starter.jpg
2020-02-16 15:55:04

రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ మరో ఆరు నెలల్లో పూర్తి కానుంది. ఆగస్టు నుంచి పూర్తిగా పోస్టు ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకధీరుడు తర్వాత సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇదే విషయాన్ని రాజమౌళి కూడా చాలాసార్లు కన్ఫర్మ్ చేశాడు. తాను మహేష్ బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉందని.. దీనికి సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటాడని దర్శకధీరుడు చాలా సార్లు చెప్పాడు. కాకపోతే తన కమిట్మెంట్స్ ఎప్పటికప్పుడు పెరిగిపోతుండటంతో మహేష్ తో సినిమా చేసే అవకాశం రావడం లేదు అంటున్నాడు రాజమౌళి. తప్పకుండా సూపర్ స్టార్ తో తన సినిమా ఉంటుందని హామీ ఇచ్చాడు ఈ  దర్శక ధీరుడు.

ఇదిలా ఉంటే ఈయన తర్వాత సినిమాపై తాజాగా మరో ప్రచారం మొదలైంది. ఆర్ఆర్ఆర్ సినిమా మాదిరి మరో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రాజమౌళి సిద్ధం అవుతున్నాడని.. అందులో మహేష్ బాబుతో పాటు ప్రభాస్ కూడా మరో హీరోగా నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి సినిమా చేస్తున్నాడంటే అభిమానులు ముందు నమ్మలేదు. కానీ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించాడు జక్కన్న. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు, ప్రభాస్ కాంబినేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. ఇది కూడా కొట్టి పారేయడానికి లేదు.

కథ బాగుంటే కచ్చితంగా మహేష్ బాబు, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ ను ఒకే సినిమాలో చూపించే సత్తా రాజమౌళికి ఉంది అంటున్నారు విశ్లేషకులు. అన్నీ కుదిరితే ఈయన తర్వాత సినిమా మరో మల్టీస్టారర్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై రాజమౌళి రియాక్షన్ ఎలా ఇస్తాడో చూడాలి.

More Related Stories