English   

RRR..అభిమానులకు రాజమౌళి ఉగాది సర్ ప్రైజ్..

RRR
2020-03-24 19:05:14

ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎప్పుడు ఏం తెలిసినా కూడా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాను ఇంత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ జరుగుతున్నా కూడా పెద్దగా విశేషాలు మాత్రం బయటికి రావడం లేదు. కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ ఆపేశారు. రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుపుతూ.. ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టి ఆసక్తి కూడా అంతే పెరిగిపోతుంది. 

ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఎలా ఉంటాడో ఒక ప్రీ లుక్ విడుదల చేశాడు రాజమౌళి. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఇప్పటివరకు అలాంటి కానుక ఇవ్వలేదు దర్శక ధీరుడు. ఇక ఇప్పుడు అది కూడా తీరిపోతుంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేయబోతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చింది. చిన్న హింట్ కూడా ఇవ్వకుండా సడన్ గా సర్ ప్రైజ్ ఇచ్చాడు దర్శకధీరుడు. జక్కన్న నుంచి అనుకోకుండా వచ్చిన ఈ ఆఫర్ తో జూనియర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చూద్దామా అంటూ నందమూరి అభిమానులు.. రామ్ చరణ్ ఎలా ఉండబోతున్నాడా అని మెగా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో తిరిగి మొదలు కానుందని తెలుస్తోంది. జూన్ వరకు టాకీ పూర్తి చేసి ఆ తర్వాత ఏడు నెలలు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. 300 కోట్లతో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జనవరి 8, 2021న ఈ చిత్రం విడుదల కానుంది.
 

More Related Stories