English   

రౌద్రం రణం రుధిరం...RRRమోషన్ పోస్టర్ వీడియో

RRR
2020-03-25 12:28:08

తెలుగు సినీ అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో  ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైటిల్‌, అలాగే లోగోను విడుదల చేసింది సినిమా యూనిట్. రోజు ఉగాదిని పురస్కరించుకుని రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి RRR(రౌద్రం రణం రుధిరం)  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు మేకర్స్.  ఒక నిమిషం 15 సెకన్లు ఉన్న ఈ మోషన్ పోస్టర్ వీడియో కూడా పోస్ట్ చేసింది యూనిట్.

ఈ పోస్టర్ లో హీరోలు ఇద్దరూ పోరాటం కోసం పరిగెడుతున్నట్టు అందులో ఒకరిని నిప్పు బ్యాక్ గ్రౌండ్ లో మరొకరిని నీరు బ్యాక్ గ్రౌండ్ లో చూపించాడు జక్కన్న.  హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో దీనికి ఆర్ఆర్ ఇచ్చాడు కీరవాణి. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది రాజమౌళి. RRR ఇండియా 1920 అని కూడా పోస్టర్‌లో పెట్టాడు జక్కన్న.ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌మ్ తమిళ దర్శకుడు సముద్రఖని కీలకపాత్రలలో కనిపించనున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నారు. 

More Related Stories