English   

RRRత‌ర్వాత ఎన్టీఆర్ చేయ‌బోయే సినిమాలు ఇవే..

 NTR
2020-03-27 17:46:12

కొన్నేళ్లుగా వ‌ర‌స విజ‌యాల‌తో దుమ్ము దులిపేస్తున్నాడు ఎన్టీఆర్. టెంపర్ నుంచి ఈయనకు ఎదురు లేకుండా పోయింది. ఈయ‌న గ‌త సినిమా అర‌వింత స‌మేత కూడా మంచి వ‌సూళ్ల‌నే తీసుకొచ్చింది. ఈ చిత్రం దాదాపు 95 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ తో విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్.. అర‌వింద స‌మేత‌తో మ‌ళ్లీ ప‌ర్లేదనిపించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు RRR సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయ‌న‌. మ‌రో ఆర్నెళ్ల వ‌ర‌కు కూడా ఇదే సినిమా ధ్యాస‌లో ఉంటాడు. వ‌చ్చే ఏడాది జనవరి 8న ఆర్ఆర్ఆర్ విడుద‌ల కానుంది. జూన్ లోపే సినిమా షూటింగ్ పూర్తి చేసి ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల‌ను విడుద‌ల చేస్తాన‌ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చెబుతున్నా కూడా న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదు. సినిమా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు కూడా ఈ హీరోలు అక్క‌డే లాక్ అవుతార‌ని తెలుస్తుంది. పైగా ఇప్పుడు కరోనా వైరస్ కూడా రావడంతో ఎన్ని రోజులు బ్రేక్ ఇస్తారో తెలియడం లేదు. 

అయినా కూడా తన నెక్ట్స్ ప్రాజెక్టులను సెట్ చేసి పెట్టుకున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ అయిపోయింది. ఈ చిత్రం అన్నీ కుదిర్తే ఆగస్ట్ నుంచి పట్టాలెక్కబోతుంది. ఇక త్రివిక్రమ్ తర్వాత ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఎన్టీఆర్ త‌ర్వాతి సినిమాలు ఇలా ఉండ‌బోతున్నాయి. ఇప్ప‌టికే జ‌న‌తా గ్యారేజ్ లాంటి స‌క్సెస్ త‌న‌కు ఇచ్చిన కొర‌టాల శివ‌తో మ‌రో సినిమా చేయ‌డానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. వీటితో పాటు తమిళ సంచలన దర్శకుడు అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడు ఎన్టీఆర్. ఈ కాంబినేష‌న్ చాలా రోజుల కిందే సెట్ అయింది. దాంతో పాటు కేజీయ‌ఫ్ సినిమాతో ఇండియ‌న్ సినిమా దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాల‌తో మ‌రో మూడేళ్ల పాటు బిజీ కానున్నాడు నంద‌మూరి చిన్నోడు.

More Related Stories