English   

RRR విడుదల వాయిదాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. 

 RRR
2020-04-04 17:05:34

రాజమౌళి ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడబోతుందా..? ఈ సినిమాను ఇప్పటికే జులై 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8కి పోస్ట్ పోన్ చేసాడు రాజమౌళి. మళ్లీ ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. అనుకున్న తేదీకి వస్తామని రామ్ చరణ్, ఎన్టీఆర్ చెబుతున్నారు కానీ అసలైన వాడు రాజమౌళి మాత్రం మళ్లీ మాట మార్చినట్లు ప్రచారం జరుగుతుంది. తన సినిమా జనవరి 8న వస్తుందనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా అనుకున్న తేదీకి రావడం కష్టమే అంటున్నారు. అయితే నిర్మాత దానయ్య మాత్రం అనుకున్న సమయానికి ఆర్ఆర్ఆర్ వస్తుందని చెప్పాడు. 

కచ్చితంగా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని.. చెప్పిన తేదీకి విడుదల చేస్తామంటున్నాడు. మొన్న విడుదలైన చరణ్ టీజర్ లో జనవరి 8 అని వేసారు. అయితే ఎంతమంది చెప్పినా రాజమౌళి సస్పెన్స్ చూస్తుంటే కొంపదీసి సినిమా వాయిదా పడబోతుందా అనేది కూడా అర్థం కావడం లేదు. ఉన్నట్లుండి అలాంటి బాంబ్ పేల్చినా పేల్చేస్తాడేమో..? ఎందుకంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా పనులుంటాయి. అలాంటిది ఇప్పుడు అనుకోకుండా షూటింగ్ ఆగిపోయింది. మరీ ముఖ్యంగా డిఐ చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఉన్నాయి. దానికి తోడు స్వాతంత్ర్యానికి పూర్వం కథ కావడంతో కచ్చితంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. 

ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం భారీ స్థాయిలోనే విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటున్నాడు రాజమౌళి. మరి అది అనుకున్నంత ఫాస్టుగా పూర్తి చేస్తాడా లేదా అనేది చూడాలిక. అయితే ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమాను ఇన్ టైమ్ లో పూర్తి చేసి జనవరి 8న విడుదల చేస్తామని ధీమాగా చెబుతున్నాడు దానయ్య. మరి ఆయన నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

More Related Stories