English   

రాజమౌళి RRRలో సూపర్ స్టార్.. ఎన్టీఆర్ బాబాయ్‌గా..

mohanlal
2020-04-07 19:54:13

బాహుబలి తర్వాత రాజమౌళి ఏం చేస్తాడనే ప్రశ్నకు సమాధానంగా ఇద్దరు సూపర్ స్టార్స్ ను కలిపి మల్టీస్టారర్ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు మెగా హీరోలను కలిపి RRR సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంది. ఇండియన్ సినిమా సూపర్ స్టార్స్ అందర్నీ తన సినిమాలో పెట్టేస్తున్నాడు ఈయన. ముఖ్యంగా ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్స్ మాత్రమే కాదు.. హిందీ ఆడియన్స్ కోసం ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ ను తీసుకున్నాడు రాజమౌళి. ఈయన కారణంగా హిందీలో కూడా సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇంట్లోనే ఉండి తన పని తాను చేసుకుంటున్నాడు రాజమౌళి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. ఇందులో ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోలున్నారు. ఇప్పుడు మరో సూపర్ స్టార్ కూడా తోడవుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆయనెవరో కాదు.. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్. ఈయన ఈ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ కి బాబాయ్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో బాగా జరుగుతున్న ఈ ప్రచారంపై రాజమౌళి యూనిట్ అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదివరకే జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పెదనాన్నగా నటించాడు మోహన్ లాల్. ఇప్పుడు బాబాయ్ అయితే నందమూరి అభిమానులకు అంతకంటే కావాల్సిందేం లేదు. పాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న RRR కోసం అన్ని భాషల నటుల్ని క్యాస్ట్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే బాలీవుడ్ నుండి అజయ్ దేవగణ్, ఆలియా భట్ ఉండగా.. తమిళ నటులను కూడా బాగానే తీసుకున్నాడు. ఇప్పుడు మోహన్ లాల్ వస్తే మళయాల మార్కెట్ కు కూడా కొదవ ఉండదు.

More Related Stories