English   

రాజమౌళిది మామూలు బుర్ర కాదు.. RRR కోసం మరో సంచలనం..

rrr
2020-04-10 06:58:01

రాజమౌళి ఏం చేసినా ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ రేంజ్ కి ఎదిగిపోయాడు దర్శక ధీరుడు. ఒక దర్శకుడికి ఇంత ఇమేజ్ వస్తుందా అనేంతగా.. స్టార్ హీరోలను కూడా డామినేట్ చేసే స్థాయికి చేరుకున్నాడు జక్కన్న. బాహుబలికి ముందు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే ఈయనను చూసి ఫిదా అయిపోయే వాళ్ళు. కానీ ఆ సినిమా తర్వాత ఇండియా మొత్తం ఇప్పుడు రాజమౌళికి సలాం చేస్తుంది. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న RRR సినిమాపై కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దాంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి బిజినెస్ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు రాజమౌళి. తాజాగా దీనిపై మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.  ట్రిపుల్ ఆర్ సినిమాపై ఉన్న క్రేజ్ అర్థం చేసుకున్న రాజమౌళి ఒక ఆన్లైన్ వీడియో యాప్ తో ఒప్పందం చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వార్తలన్నీ ఆ యాప్ నుంచి విడుదల చేయాలని చూస్తున్నాడు. అది హాట్ స్టార్ అని ప్రచారం జరుగుతుంది. ఆ యాప్ లో దీనికి సంబంధించిన వార్తలు అన్నీ బయట పెట్టడమే కాకుండా సినిమాను కూడా అందులో సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత డిజిటల్ ప్రింట్ అందుబాటులోకి తీసుకుని వచ్చే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికోసం భారీగానే ఆ యాప్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు రాజమౌళి అని ఇండస్ట్రీలో వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదేగాని నిజమైతే దర్శకధీరుడు మరో సరికొత్త ట్రెండ్ కు తెర తీసినట్లే. ఈ ప్రత్యేకమైన యాప్ లోనే టీజర్, ట్రైలర్ కూడా విడుదల చేయాలని చూస్తున్నాడు రాజమౌళి.

More Related Stories