English   

RRRకోసం కొత్త భాష నేర్చుకుంటున్న ఎన్టీఆర్

NTR
2020-04-22 11:44:33

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుథిరంను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తూన్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు హిందీ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ ను ఖరారు చేస్తూ ఇటీవలే మోషన్‌ పోస్టర్‌ను, చరణ్‌ పుట్టిన రోజున విడుదల చేసింది సినిమా యూనిట్. 

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ టీజర్‌ విడుదల కాగా.. ఒక్క మలయాళం తప్ప అన్ని భాషల్లోనూ ఎన్టీఆర్‌ డబ్బింగ్‌ చెప్పడం హైలైట్ గా మారింది. ఒకరకంగా ఈ వీడియోలన్నిటికీ ఎన్టీఆర్‌ గొంతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా మనోడి గొంతు హైలైట్ అయ్యింది. అయితే  ఒక్క మలయాళంలో నే ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పలేకపోయాడు. అయితే మిగతా బాషలలో వచ్చిన రెస్పాన్స్ తో ఈ బాషలో కూడా ఆయన్నే డబ్బింగ్ చెప్పమని జక్కన్న బలవంతం చేశాడట. దీంతో ‘ఆర్ఆర్ఆర్‌’ కోసం ఎన్టీఆర్ మలయాళంలోనూ డబ్బింగ్‌ చెప్పేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. షూట్ పూర్తయ్యే నాటికల్లా ఆ భాషలో పట్టు సంపాదించేందుకు మలయాళంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు.  కరోనా లాక్ డౌన్ తో వచ్చిన ఖాళీ సమయాన్ని ఎన్టీఆర్ ఇలా మలయాళం  నేర్చుకోవడానికి కేటాయిస్తున్నాడట. అయితే ఈ సినిమా విడుదల విషయంలోనే అనేక అనుమానాలు నెలకొన్నాయి. 

More Related Stories