English   

RRR మూలకథ రివీల్ చేసిన రాజమౌళి..

rrr
2020-04-23 07:32:55

కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు మొత్తం ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం వేచి చూస్తున్నారు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ తో చేస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ సినిమా కథ ఏమై ఉంటుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పాడు జక్కన్న. ఎప్పటినుంచో అభిమానులు వేచి చూస్తున్న ఈ సినిమా మూలకథ బయట పెట్టేసాడు. ఇద్దరు స్వతంత్ర సమరయోధులు ఉండటంతో దేశభక్తి కథాంశంగా త్రిబుల్ ఆర్ ఉండబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ తన సినిమాల్లో దేశభక్తి ఉండదని చెప్పాడు. ఇది పక్కా కమర్షియల్ సినిమా కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి.

చరిత్రలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఇద్దరు కలవలేదని.. కలిసినట్టు ఎక్కడ చరిత్ర చెప్పలేదని.. ఒకవేళ వాళ్ళు కలిసి ఉంటే ఎలా ఉండేది అనే విషయాన్ని తాము ఊహాజనితంగా ఈ సినిమాలో చూపిస్తున్నాం అని చెప్పాడు రాజమౌళి. 1919 తర్వాత మూడేళ్లపాటు అల్లూరి, కొమరం భీమ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని.. ఆ మూడేళ్ల కాలాన్ని తాము కథగా రాసుకున్నామని చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా మా ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతుందని మరో సంచలన విషయం బయట పెట్టాడు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రాణస్నేహితులుగా నటిస్తున్నట్లు చెప్పాడు రాజమౌళి. వాళ్ళిద్దరి మధ్య ఉండే స్నేహమే సినిమా కథ అంటున్నాడు. మొత్తానికి సినిమాలో ఉన్న అసలు విషయం బయట పెట్టి అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచాడు రాజమౌళి.

More Related Stories