English   

RRR సినిమాపై వివాదాలు.. రానీ చూస్కుందామంటున్న రాజమౌళి..

rrr
2020-04-23 21:06:57

ఈ రోజుల్లో పెద్ద సినిమాలు తెరకెక్కుతున్నాయంటే ముందు వాటికి వివాదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ సృష్టించడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. రాజమౌళి సినిమాకు కూడా ఇదే జరుగుతుంది. ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. పైగా ఈ సినిమా కథ కూడా ముందే చెప్పేస్తున్నాడు దర్శకధీరుడు. ఇది స్నేహం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని.. ఇందులో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల ఫ్రెండ్ షిప్ సినిమా అంటున్నాడు రాజమౌళి. దాంతో అసలు రచ్చ మొదలైంది. తమ చరిత్రను తప్పుదారి పట్టిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ముందే హెచ్చరిస్తున్నారు చరిత్ర కారులు.అసలు అల్లూరి సీతారామరాజు జీవితంలో రొమాన్స్ ఉండదని.. అలాంటి పాత్రకు హీరోయిన్ ని ఎందుకు పెడుతున్నారు అంటూ రాజమౌళిని ప్రశ్నిస్తున్నారు కొందరు. దీనిపై వివాదం సృష్టించడానికి సిద్ధమైపోయారు. ఇక ఈ విషయంపై స్పందించిన రాజమౌళి కాంట్రవర్సీలు చేయాలనుకునే చెంప ఛెళ్లుమనిపించేలా సమాధానం చెప్పాడు.

అసలు సినిమాలో ఏముంటుందో తెలియకుండా.. ఒక దర్శకుడి బుర్రలో ఏం తీస్తున్నాడో అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వివాదాలు సృష్టించే వాళ్ల గురించి తాను అసలు పట్టించుకోను అంటున్నాడు రాజమౌళి. అయినా ఈ సినిమాలో చరిత్ర ఉండదని.. చరిత్రలో లేనిదే తాము ఊహించి సినిమా చేస్తున్నామంటున్నాడు.అలాంటి వాళ్ళ పై దృష్టి పెట్టి తన సినిమాపై ఫోకస్ తగ్గించలేన‌ని.. తన దృష్టి ఎప్పుడూ ఒక సినిమాను అత్యున్నతంగా ఎలా తెరకెక్కించాలి.. ప్రేక్షకులకు దాన్ని ఎలా అందించాలనే విషయాలపై మాత్రమే ఉంటుందని.. అంతేగాని ఎక్కడ ఎవరు ఏ వివాదం సృష్టిస్తున్నారో అని పట్టించుకోవడం తన పని కాదు అంటున్నాడు రాజమౌళి. సినిమా విడుదలైన తర్వాత చూసి అప్పుడు కాంట్రవర్సీలు గురించి మాట్లాడితే సమాధానం చెప్తా అంటున్నాడు జక్కన్న. అప్పటివరకు ఎవరేమనుకున్నా కూడా తాను అనుకున్నది తీసి తీరుతాను అంటూ సవాల్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయన చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. మరీ సినిమా విడుదల కాకముందే వివాదాలు సృష్టించడం అనేది అవివేకమే అవుతుంది.

More Related Stories