English   

RRR రిలీజ్ డేట్ కర్ణుడి చావు కారణాల మాదిరే ఉందిగా..

rrr
2020-05-10 09:48:08

ఏమో ఇప్పుడు ఇదే అనిపిస్తుంది మరి. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు ఇప్పుడు RRR సినిమా వాయిదా పడటానికి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జులై 30న విడుదలవుతుందని చెప్పిన సినిమాను వచ్చే ఏడాది జనవరి 8కి పోస్ట్ పోన్ చేసాడు రాజమౌళి. ఇప్పుడు మరోసారి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నాడని తెలుస్తుంది. అనుకున్న తేదీకి వస్తామని రామ్ చరణ్, ఎన్టీఆర్ చెబుతున్నారు కానీ అసలైన వాడు రాజమౌళి మాత్రం మళ్లీ మాట మార్చినట్లు ప్రచారం జరుగుతుంది. తన సినిమా జనవరి 8న వస్తుందనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ అయిపోయింది. ఇప్పటికే మూడు నెలలు వెనకబడి ఉన్నారు ఆర్ఆర్ఆర్ టీం. దాంతో పాటు చరణ్ కూడా ఆచార్యతో బిజీ కానున్నాడు. అన్నింటికి మించి షూటింగ్ తర్వాత కూడా ఇంకా చాలా పనులుంటాయి. అలాంటిది ఇప్పుడు అనుకోకుండా షూటింగ్ ఆగిపోయింది. మరీ ముఖ్యంగా డిఐ చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఉన్నాయి.

దానికి తోడు స్వాతంత్ర్యానికి పూర్వం కథ కావడంతో కచ్చితంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం భారీ స్థాయిలోనే విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటున్నాడు రాజమౌళి. విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్టులు పని చేయాలంటే హై ఎండ్ సిస్టమ్స్ అవసరం.. అవన్నీ ఆఫీసుల్లోనే ఉంటాయి.. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా ఈ గ్రాఫిక్స్ వర్క్స్ అన్నీ నత్తనడకన నడిచినట్లే. అంతే కాకుండా ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఒక్క ఇండియాలోనే కాకుండా వివిద దేశాల్లో జరుగుతుంది. అక్కడ కూడా కరోనా దెబ్బకు పనులన్నీ ఆగిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ 'RRR' పనులు జోరందుకోవు. ఇన్ని కారణాలున్నాయి కాబట్టే 'RRR' సంక్రాంతికి రావడం దాదాపు అసాధ్యం అని.. వేసవికి వాయిదా పడుతుందని అంటున్నారు.

More Related Stories