RRR దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్..

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక బిగ్‌బీ తప్పించి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి సోకింది. ఆయనకు ఆయన కుటుంబానికి పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీద అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని పేర్కొన్నారు. వైద్యుల సలహా ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు.
‘నేను, నా కుటుంబసభ్యులు కొద్ది రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడ్డాం. అయితే ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ కరోనా టెస్ట్ చేయించుకున్నాం, ఈ రోజు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు మేము ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉంటున్నాం. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. మాకు ఎటువంటి లక్షణాలు లేవు.. కానీ మేము అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శరీరంలో యాంటీ బాడీలు డెవలప్ అవ్వాలని చూస్తున్నాం.. ఆ తర్వాత ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నాం’ అని రాజమౌళి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పేర్కొన్నారు.