English   

RRR టీంకు అనుకోని షాక్.. నిర్మాత నెత్తిన మరో పిడుగు..

RRR
2020-09-10 17:13:23

కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉండి తన సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ చూసుకుంటున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈయన ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ట్రిపుల్ ఆర్ షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా ఆగిపోయింది. గత ఐదు నెలల నుంచి కరోనా కారణంగా అంతా ఇంట్లోనే ఉండిపోయారు. మధ్యలో షూటింగ్ కోసం ప్లాన్ చేసినా కూడా కుదర్లేదు. పైగా జక్కన్న కుటుంబం అంతా కరోనా బారిన పడి మళ్లీ కోలుకున్నారు. దాంతో వాళ్లు కూడా మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా నుంచి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు దర్శక ధీరుడు. దీనికోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 

అయితే ఇక్కడే యూనిట్ కు ఓ చిక్క వచ్చి పడింది. ఈ సినిమా కోసం లాక్‌డౌన్ కు కొన్ని రోజుల మందు దాదాపు 20 కోట్లతో అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ సెట్ ఒకటి నిర్మించారు. అక్కడే భారీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసాడు రాజమౌళి.  అయితే కొన్ని నెలలుగా దాన్ని వాడకుండా ఉండిపోవడంతో సెట్ పూర్తిగా దెబ్బ తింది. దాంతో ఇప్పుడు దాన్ని మళ్లీ మార్చుకోడానికి చాలా ఖర్చు అయ్యేలా కనిపిస్తుంది. కొత్త సెట్ వేసే దానికంటే కూడా దాన్ని మాడిఫై చేయించడమే నయం అంటున్నారు దర్శక నిర్మాతలు. దీనికోసం దానయ్యకు మరో 2 నుంచి 3 కోట్ల వరకు అదనంగా ఖర్చు రావడం ఖాయం. ఇది నిర్మాతకు ఊహించని షాక్. ఇదిలా ఉంటే దసరా నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ షూటింగ్ కు రావడానికి సిద్ధంగా ఉండటం ఒక్కటే ఇప్పుడు నిర్మాతకు ఊరటనిచ్చే విషయం. 

More Related Stories