English   

RRR రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి

RRR
2020-09-29 11:57:05

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ కారోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాంతో మొదట చిత్ర యూనిట్ ప్రకటించిన తేదీన సినిమా విడుదల అవుతుందా లేదా అన్న ప్రశ్న అభిమానుల్లో సినిప్రియుల్లో మొదలైంది. అయితే ఇప్పటికే లాక్ డౌన్ తరవాత దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టి చకచకా చిత్రీకరణ పూర్తిచేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా నిర్మాత దానయ్య సినిమాను జులై30 2020 తేదీన రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారట. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా చేస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమా తియ్యడం ఈ సినిమా ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఇప్పటికే చరణ్ బర్త్ డే కు ఎన్టీఆర్ ఒక ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు.

ఆ ఫస్ట్ లుక్ వీడియోకు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా పై ఇటు మెగా అభిమానుల్లో మరోవైపు ఎన్టీఆర్ అభిమానుల్లో ఎప్పుడు సినిమా థియేటర్ లో చూస్తామా అన్న ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉంది. మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోని అన్ని ఇండస్ట్రీ లను రాజమౌళి షేక్ చేశారు. దాంతో బాలీవుడ్ ప్రముఖ నటులు సైతం రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఆసక్తి చూపించారు. కానీ దర్శకధీరుడు మాత్రం తెలుగు స్టార్స్ ను ప్రపంచానికి పరిచయం చేసేలా వరుసగా వారితోనే సినిమాలు చేస్తూ టాలీవుడ్ కీర్తిని ప్రపంచానికి చాటుతున్నాడు.

More Related Stories