English   

RRR హీరోస్ రెడీ అంటున్న జక్కన్న

RRR
2020-10-06 21:27:33

దేశంలో కరోనా లాక్ డౌన్ తో గత ఏడు నెలలుగా షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా బ్రేక్ పడింది. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ఉండటంతో సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. భారీ బడ్జెట్ తో నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా రాజమౌళి తన సినిమాలతో పేరు సంపాదించడంతో దేశ వ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో రాజమౌళి కరోనా బారిన పడి త్వరలోనే కొలుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం కరోనా బారిన పడి త్వరలోనే కొలుకున్నారు. 

ఇక లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో అన్ని సినిమాల షూటింగ్ లు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆర్ఆర్ఆర్ ఎప్పుడు మొదలవుతుందా అని సోషల్ మీడియాలో ట్రోల్స్ చెయ్యడం ప్రారంభించారు. దాంతో చిత్ర యూనిట్ సోమవారం త్వరలోనే షూటింగ్ ను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇక అంతలోనే ఈరోజు జక్కన్న ఓ వీడియోతో సర్ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ కు సిద్ధమౌతున్నట్టు తెలుపుతూ వీడియోలో షూటింగ్ సమాగ్రికి పట్టిన దుమ్ము ధూళిపారు. 

మొదట షూటింగ్ స్పాట్ లో డోర్లు తెరవడంతో మొదలైన వీడియో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక వీడియోలో రాజమౌళి రెడీ హీరోస్ అంటూ చెప్పిన డైలాగ్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఒక గుర్రం పక్కన బులెట్ బైక్ వెళుతున్న సన్నివేశం కనిపిస్తోంది. అయితే తాము మార్చ్ వరకు షెడ్యూల్ అనుకున్నామని కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ లేట్ అయ్యిందని  వీడియోలో పేర్కొన్నారు. ఇక జక్కన్న విడుదల చేసిన వీడియోతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

More Related Stories