English   

RRR పై కీలక అప్డేట్..కథ క్లైమాక్స్ కు చేరింది

 RRR
2021-01-19 16:22:53

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథనాయకులుగా నటిస్తున్నారు. సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా...ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ సైతం ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.  ఇప్పటికే సినిమా నుండి విడుదలైన చరణ్, ఎన్టీఆర్ టీజర్ లు యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేసాయి. 

ఇదిలా ఉండగా తాజాగా చిత్ర ఎస్ఎస్ రాజమౌళి సినిమాపై ఓ అప్డేట్ ఇచ్చారు. సినిమా క్లైమాక్స్ షూటింగ్ మొదలైదని పేర్కొన్నారు. "నా రామరాజు మరియు భీమ్ వారు సాదించాలనుకున్నదానికోసం ఒక్కటయ్యారు" అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందగర్భంగా భీమ్, రామరాజు చేతులు కలిపిన ఫోటో ను రాజమౌళి విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ అవుతుందని మెగా, ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 

More Related Stories