English   

RRR సినిమాకు రికార్డు స్థాయి ప్రీరిలీజ్ బిజినెస్

 RRR
2021-03-26 13:23:15

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్న‌కంగా తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్యాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమాకు సుమారు 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇండియాలో ఈ రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌టం ఇదే మొద‌టిసారి కావ‌డం విషేశం. ఈ చిత్రానికి నైజాంలో దాదాపు 75 కోట్లు, ఆంధ్ర సీడెడ్ 165 కోట్లు ,తమిళనాడులో 48 కోట్లు, కర్ణాటకలో 45 కోట్లు, కేరళలో 15 కోట్ల బిజినెస్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. సినిమా హిందీ రైట్స్ దాదాపు 100 కోట్లకు అమ్మగా..ఓవర్సీస్ లో రూ. 77 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. 

అంతే కాకుండా ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు కూడా భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ అన్ని భాషల డిజిటల్ - శాటిలైట్ రైట్స్ కోసం సుమారు 225 కోట్లు ఆఫర్ చేసిందని ట్రేడ్ టాక్. ఇక భారతీయ సినీ చరిత్రలోనే ఈ రేంజ్ లో అమ్ముడుపోయిన సినిమాగా 'ఆర్.ఆర్.ఆర్' నిలవనుంది. ఇదిలా ఉండ‌గా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. బాలీవుడ్ నుండి అలియాభ‌ట్ రామ్ చ‌ర‌ణ్‌కు హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా..ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ న‌టిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో అజ‌య్ దేవ్‌గ‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

More Related Stories