English   

RRR దర్శకుడిగా BJP ఎమ్మెల్యే.. రాజమౌళి ఫ్యాన్స్ షాక్..

rrr
2020-02-24 07:00:03

పిచ్చి గానీ ఎక్కిందా.. రాజమౌళి కాకుండా RRR సినిమాకు మరో దర్శకుడు ఎందుకు ఉంటాడు.. అందులోనూ బిజేపీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా..? ఈ ప్రశ్న మనను కాదు.. గూగుల్ తల్లిని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు అడిగినోళ్లకు.. అడగనోళ్లకు అదే చెబుతుంది మరి. RRR దర్శకుడు ఎవరంటే రాజమౌళితో పాటు మరొకరి పేరును కూడా చూపిస్తుంది గూగుల్. అదే ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. తప్పు చేసారని తెలిసిన తర్వాత కూడా అది ఇంకా మార్చకపోవడం నిజంగానే ఆశ్చర్యమేసే విషయం. RRR దర్శకుడు ఎవరంటే చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు కానీ గూగుల్ తల్లి మాత్రం రాజమౌళితో పాటు మరొకర్ని కూడా చూపిస్తుంది. మనకు ఏ అనుమానం వచ్చినా కూడా ముందు గూగుల్ చేస్తాం.

కానీ ఇప్పుడు ఆన్సర్ ఇచ్చే గూగుల్ కన్ప్యూజ్ చేస్తుంది. RRR సినిమా దర్శకుడు ఎవరు అని కొడితే రాజమౌళితో పాటు మరొకరి కూడా కనిపిస్తుంది. ఆయన పేరు సంజయ్ పాటిల్.. అసలు ఎవరీయన అని ఆరా తీస్తే బిజేపీ ఎమ్మెల్యే అని చూపిస్తుంది. ఆయన్ని తీసుకొచ్చి రాజమౌళి పక్కన పెట్టింది గూగుల్ తల్లి. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. అసలేంటి ఈ కన్ప్యూజన్.. ఎందుకు ఇలా జరుగుతుందని ఆరా తీస్తే అదేదో HTML లో సమస్య అని తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అది ఇంకా మార్చలేదు. రాజమౌళి పేరు కొడితే కూడా పక్కన సంజయ్ పాటిల్ ఫోటో కూడా రావడం విడ్డూరం. మరి ఈ తప్పును గూగుల్ ఎప్పటికి సరిచేస్తుందో చూడాలిక. ఇది చూసి సర్.. సుందర్ పిచాయ్ గారూ కాస్త ఇక్కడ చూడండి సర్.. మీ గూగుల్ దారి తప్పిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More Related Stories