English   

ఆర్ఆర్ఆర్ భవితవ్యం తేల్చనున్న కేజీఎఫ్

KGF
2020-07-04 16:37:36

"మూడు ఇండస్ట్రీలు.. మూడు నెలలు..  మూడు వేల కోట్ల నష్టం" ఇదేదో సినిమా లైన్ లా ఉందే అనుకోకండి. ఇది మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి కరోనా వేసిన దెబ్బ. మూడు ఇండస్ట్రీలు అంటే తెలుగు, తమిళ, హిందీ సినిమాలకి మెయిన్ బ్రాంచ్ లు అయిన హైదరాబాద్, చెన్నై, ముంబాయిలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇప్పట్లో మళ్ళీ ఇండస్ట్రీ కోలుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, చెన్నై కేంద్రంగా నడుస్తున్న తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, ముంబాయి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికే 3000 కోట్లు నష్టపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ నష్టాల నుండి ఇండస్ట్రీ ఎప్పటికి కోలుకుంటుందో ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది.

ఇలాంటి పరిస్థితులలో అత్యంత భారీ బడ్జెట్ తో రాజమౌళి ఈ మూడు బాషలే మెయిన్ టార్గెట్ అనుకుని తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పుడు ఆయనకు పెద్ద టెన్షన్ గా మారింది. ఈ సినిమా మొదలు పెట్టిన నాడు జక్కన్న అనుకున్న విధంగా ఇప్పుడు మార్కెట్ అవుతుందా అన్న సందేహాలు ప్రస్తుతం రాజమౌళిని వెంటాడుతున్నట్లు టాక్. దీనికి తోడు రానున్న రోజులలో ప్రజలు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూస్తారా ? అని వస్తున్న అంచనాలు కూడ భారీ సినిమాల దర్శక నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో రాబోయే ఆదివారం స్టార్ మా లో ప్రసారంకాబోయే ‘కేజీ ఎఫ్’ ఈప్రశ్నలు అన్నింటికి సమాధానాలు ఇస్తుందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా కన్నడ నాటే కాక ప్యాన్ ఇండియా లెవల్ లో 380 కోట్ల షేర్ వసూలు చేయడం పెద్ద రికార్డ్. దాదాపు ఏడాదిన్నర తరువాత జూలై 5 ఆదివారం నాడు కేజీఎఫ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం అవుతోంది. ఈ ప్రీమియర్ కి టీఆర్పీ ఎలా ఉంటుందన్న దని మీదే భవిష్యత్ లో విడుదల కాబోయే భారీ సినిమాల మార్కెట్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఆమెజాన్ ప్రైంలో ఉంది, ఎన్నో సార్లు జనం చూసే ఉంటారు. మళ్ళీ ఈ సినిమాను బుల్లితెర పై కూడ చూస్తే భారీ బడ్జెట్ సినిమాల పట్ల జనం అభిరుచి ఏమాత్రం తగ్గలేదన్న సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. జక్కన్న కూడా ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్నాడని అంటున్నారు.

More Related Stories