English   

RRR విడుదల వాయిదా.. దేవుడా మళ్ళీ అదే కథ..

rrr
2020-03-29 18:57:08

రాజమౌళి సినిమా ఎలా వస్తుంది అనే ప్రశ్న అడగొచ్చు కానీ ఎప్పుడొస్తుంది అని మాత్రం అడక్కూడదు. ఇఫ్పుడు RRR సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. కానీ అనుకున్నంత మాత్రం కాదు. పైగా మధ్యలో కరోనా కారణంగా కొన్ని రోజులు వాయిదా పడింది. దాంతో ఇప్పటికే జులై 30న విడుదలవుతుందని చెప్పిన సినిమాను వచ్చే ఏడాది జనవరి 8కి పోస్ట్ పోన్ చేసాడు రాజమౌళి. ఇక ఇప్పుడు మరోసారి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నాడని తెలుస్తుంది. అనుకున్న తేదీకి వస్తామని రామ్ చరణ్, ఎన్టీఆర్ చెబుతున్నారు కానీ అసలైన వాడు రాజమౌళి మాత్రం మళ్లీ మాట మార్చినట్లు ప్రచారం జరుగుతుంది. తన సినిమా జనవరి 8న వస్తుందనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. మొన్న విడుదలైన చరణ్ టీజర్ లో జనవరి 8 అని వేసారు కానీ కచ్చితంగా ఆ డేట్ మారిపోతుందని తెలుస్తుంది. ఈయన సస్పెన్స్ చూస్తుంటే కొంపదీసి సినిమా వాయిదా పడబోతుందా అనేది కూడా అర్థం కావడం లేదు.

ఉన్నట్లుండి అలాంటి బాంబ్ పేల్చినా పేల్చేస్తాడేమో..? ఎందుకంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా పనులుంటాయి. అలాంటిది ఇప్పుడు అనుకోకుండా షూటింగ్ ఆగిపోయింది. మరీ ముఖ్యంగా డిఐ చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఉన్నాయి. దానికి తోడు స్వాతంత్ర్యానికి పూర్వం కథ కావడంతో కచ్చితంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం భారీ స్థాయిలోనే విజువల్ ఎఫెక్ట్స్ వాడుకుంటున్నాడు రాజమౌళి. మరి అది అనుకున్నంత ఫాస్టుగా పూర్తి చేస్తాడా లేదా అనేది చూడాలిక. అన్నీ కుదిర్తే కచ్చితంగా సినిమాను జనవరి 8న విడుదల చేస్తామని చెప్పినా కూడా ఇప్పుడు బాహుబలి తేదీకి వెళ్లిపోతుందని ప్రచారం జరుగుతుంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ విడుదలైన జులై 10న ఈ చిత్రం విడుదల కానుందని తెలుస్తుంది. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చేంత వరకు ఈ సస్పెన్స్ తప్పదు.

More Related Stories