English   

ఆర్ఆర్ఆర్ అప్డేట్..రిలీజ్ డేట్ లాక్ చేసిన జక్కన్న

RRR
2021-06-17 12:03:02

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ భామ ఆలియా భట్  రామ్ చరణ్ కు జోడీగా...హాలీవుడ్ నటి ఒలివియా ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తున్నారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా విజృంభణతో సినిమా విడుదల వాయిదా పడింది. దాంతో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలైంది. 

అయితే తాజా సమాచారం ప్రకారం జక్కన్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారట.  జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట. ఆర్ఆర్ఆర్ అల్లూరి మరియు కొమురం భీమ్ లకు సంబంధించిన సినిమా.. వీరిద్దరూ కూడా స్వాతంత్ర సమరయోధులు కాబట్టి జనవరి 26 అయితే కలిసివస్తుందని జక్కన్న భావించారట. అందువల్లే ఆ డేట్ ను లాక్ చేసారట. అంతేకాకుండా ఈ సినిమా నుండి ఓ స్పెషల్ టీజర్ ను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇది ఫిల్మ్ నగర్ టాక్ మాత్రమే. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

More Related Stories