English   

RTC స్ట్రైక్‌.....పండగ చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి.....

Chiranjeevi.jpg
2019-10-11 08:11:36

RTC కార్మికులు స్ట్రైక్‌ చేస్తే చిరంజీవికి వచ్చిన లాభమేంటి అనుకుంటున్నారా..? ఉంది.. కచ్చితంగా ఉంది.. ఇప్పుడు ఆ లాభం ఏంటో చిరంజీవికే తెలుస్తుంది. ఊళ్లకు వెళ్లిన వాళ్లు తిరిగి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే RTC స్ట్రైక్‌ ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. అటు ప్రభుత్వం.. ఇటు ఉద్యోగులు ఎవరికి వాళ్లు దిగిరావడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో RTC స్ట్రైక్‌తో ప్రజలు ఇబ్బందులు చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దసరా సెలవులను మరో మూడు రోజులు పొడగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాంతో సైరా సినిమాకు మరింత హెల్ప్ కానుంది ఇది. కచ్చితంగా మూడు రోజులు సెలవులు పొడగిస్తే తెలంగాణలో వసూళ్ళు మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే విడుదలైన 8వ రోజు కూడా 2.50 కోట్లు షేర్ వసూలు చేసింది సైరా. ఈ లెక్కన పండగ హాలీడేస్ మరో మూడు రోజులు కానీ పెరిగాయంటే మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర మాయచేయడం ఖాయం. అక్టోబర్ 14న రీ ఓపెన్ కావాల్సిన స్కూల్స్ కాస్తా ఇప్పుడు మరో మూడు రోజుల పాటు మూత పడనున్నాయి. దాంతో ఈ సెలవులు కూడా సైరాకు బాగానే కలిసొస్తాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మరి వీటిని చిరు ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలిక.

More Related Stories