English   

మెగా అల్లుడు కానున్న దేవరకొండ...క్లారిటీ ఇచ్చిన విజయ్ !

rumors on niharika vijay deverakonda marriage
2019-03-24 11:39:42

మెగా అల్లుడు కానున్న విజయ్ దేవరకొండ....నిహారికతో విజయ్ పెళ్లి...ఈ వార్తలు ఇప్పటికి కాదు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎక్కువగా విజయ్ ని మెగా కాంపౌండ్ సపోర్ట్ దొరకడంతో పాటు ఆయన మెగా ఫ్యామిలీలోని అరవింద్ లాంటి వారితో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. అయితే నిన్న జరిగిన నిహారిక కొత్త సినిమా సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా రావడంతో ఈ పుకారు నిజమనే నమ్మారు కొంత మంది. అయితే అలా నమ్మిన వారందిరికీ షాక్ ఇస్తూ నిహారికకి పెద్దన్నగా ఈ ఫంక్షన్ కి వచ్చానని చెప్పుకొచ్చాడు విజయ్. నిహారిక వాళ్ల నాన్న నాగబాబుతో వర్క్ చేశానని గీత గోవిందం సినిమాలో ఆయనతో చేసినప్పుడు నిజంగానే ఆయన నాన్న అనే ఫీలింగ్ వచ్చిందని. ఫస్ట్ డే నాగబాబు గారు నువ్ మంచోడివేనయ్యా అన్నారని అన్నారు. ప్రస్తుతం నాగబాబు పొలిటికల్‌గా బిజీ అయ్యారని, వరుణ్ కూడా యూఎస్‌ లో ఉండటంతో ఇక్కడకు రావడం కుదరలేదని అందుకే నాగబాబుకి కొడుకుగా నిహారికకి బ్రదర్‌ గా డ్యూటీ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్నిరోజులుగా వస్తున్న పుకార్లకి విజయ్ చెక్ పెట్టినట్టు అయ్యింది.

More Related Stories