English   

లూసిఫర్ విషయంలో అవన్నీ రుమార్సే 

Chiranjeevi
2020-07-07 18:00:19

మలయాళంలో వచ్చిన లూసిఫర్‌ సినిమా తెలుగులో రీమేక్‌ అవుతోంది. సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా మీద భారే అంచనాలు ఉన్నాయి. మళయాళంలో మోహన్‌లాల్‌ పోషించిన పాత్రని ఇక్కడ చిరంజీవి ప్లే చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ఒక నెగటివ్ రోల్ చేశారు. ఆ రోల్ కే ఇప్పుడు జగపతిని రోప్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే లూసిఫర్ సినిమాలో మోహన్‌ లాల్‌ క్యారెక్టర్‌కి జోడీ ఉండదు. ఎక్కడా కనీసం హీరోయిన్‌ ఫోటో కాదు కదా అసలు ఆ ఊసే ఎక్కడా వినిపించదు. పాలిటిక్స్‌, మాఫియా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ని పెడుతున్నారని ఒకసారి, అలా లేదని ఒకసారి ప్రచారం జరుగుతూ వస్తోంది. 

ఆ విషయం మీద క్లారిటీ లేకున్నా ఈ సినిమాలో మరో కీలక లేడీ రోల్ ఉంటుంది. ఆ పాత్రలో విజయశాంతి కనిపించే అవకాశం ఉందని కూడా అన్నారు ఆ మధ్య. అయితే ఆ తరువాత మరో పేరు తెరమీదకు వచ్చింది. నటి సుహాసినిని ఈ సినిమాలో ఆ పాత్రలో నటిస్తుందని అన్నారు. కీలకమైన ఈ పాత్రను మలయాళంలో మంజూ వారియర్ పోషించారు. ఇప్పుడు తెలుగులో కొందరి పేర్లు వినిపించినా తాజాగా సుహాసిని పేరు తెర మీదకు వచ్చింది. అయితే ఈ పుకార్లలో ఏ ఒక్కటి నిజం కాదని తెలిసింది. ఆ క్యారెక్టర్ కి ఎవర్నీ ఫైనల్ చేయలేదని అంటున్నారు. అయితే ఈ విషయాల మీద యూనిట్ క్లారిటీ ఇస్తే కానీ పుకార్లకీ బ్రేక్ పడదు. 

More Related Stories