English   

ఆర్ఎక్స్ 100 కుర్రాడు ఈ సారి ఇద్దరితో రొమాన్స్

RX 100 Hero Karthikeya Romancing With Two Debut Heroines in Next bilingual Movie
2018-11-15 14:31:39

ఫస్ట్ మూవీ చేసినప్పుడు ఇతనెవరు అని కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ కాస్త గ్యాప్ తీసుకున్నా.. రెండో మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 తెలుగులో సరికొత్త ట్రెండ్ కు బీజం వేసిన సినిమా. మొదట్లో అంతా అర్జున్ రెడ్డి లా ఉందనుకున్నా.. ఇప్పుడు చాలా సినిమాల టీజర్స్ పోస్టర్స్ చూస్తే ఆర్ఎక్స్ 100లా ఉందే అనుకునేలా చేసిందీ మూవీ టీమ్. మేజర్ షేర్ దర్శకుడిదే అయినా దర్శకుడి విజన్ లో జీవించిన కార్తికేయకు కూడా మంచి పేరు వచ్చింది. అలాగే ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం తమిళ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మిస్తోన్న ‘హిప్పీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. వైవిధ్యమైన ఆహార్యంతో కనిపిస్తోన్న కార్తికేయ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు.

గతంలో సూర్య హీరోగా నువ్వు నేను ప్రేమ అనే సినిమా డైరెక్ట్ చేసిన టిఎన్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ బై లింగ్వుల్ గా తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ మూవీలో కార్తికేయ హిప్పీలా కనిపించినా.. అతనో బాక్సర్ అని చెబుతున్నారు. ఏ బాధ్యతలూ లేకుండా స్వతంత్ర జీవితం గడిపేవారిని ఇలా డిఫరెంట్ లుక్స్ తో కనిపించేవారిని హిప్పీ సమూహాలు అనేవాళ్లు. ఈ కల్చర్ 1960స్, 70స్ లో బాగా ఫేమస్. అలాంటి కల్చర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ కూడా ఇంట్రెస్ట్ పెంచడంలో సక్సెస్ అయింది.

మొత్తంగా హిప్పీలో కార్తికేయ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ కు చేయబోతున్నాడు. ఆ ఇద్దరూ కొత్త బ్యూటీస్ కావడం విశేషం. దిగాంగణా సూర్యవన్సీ, జాబ్జాసింగ్ అనే భామలు ఈ మూవీతో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ గత సినిమాతో పరిచయమైన పాయల్ రాజ్ పుత్ లా ఈ భామలు కూడా ఫేమస్ అవుతారేమో చూడాలి. ఏదేమైనా కుర్రాడి సుడి మాత్రం మామూలుగా లేదు.

More Related Stories