English   

ఐదు నిమిషాల పనికి ఐదు లక్షలు తీసుకొంది

RX 100 Heroine Payal Rajput has Demanded 5 lacks for 5 Minutes Work
2018-08-09 00:05:27

క్రేజ్ రావాలే గానీ దాన్ని క్యాష్ చేసుకోవడం ఎలాగో మన హీరోయిన్లకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. నిన్నటి వరకూ వాళ్లెవరో కూడా తెలిసి ఉండదు. కానీ సడెన్ గా వచ్చే క్రేజ్ ను ఖచ్చితంగా క్యాష్ చేసుకుంటున్నారీ బ్యూటీస్. ఎవరి కోసమో, దేనికోసమో కాంప్రమైజ్ కావడంలేదు. ఇక తమతో పని ఉంటే మనీ మేటర్ తేలందే ఓకే చెప్పడం లేదు. లేటెస్ట్ గా ఆర్ఎక్స్ 100 సినిమాతో ఆకట్టుకున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ఓ ఐదు నిమిషాల పనికి ఐదు లక్షలు డిమాండ్ చేసి హాట్ న్యూస్ గా మారింది. ఆర్ఎక్స్ 100లో అందాల ప్రదర్శనతో పాటు లిప్ లాక్స్ తోనూ హాట్ హాట్ గా రెచ్చియిన ఈ భామ ఓవర్ నైట్ హాట్ ఫేవరెట్ అయిపోయింది. దీంతో తనకు చాలా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇందులో భాగంగా తెలుగులో ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అవార్డ్స్ ఫంక్షన్ లో అమ్మడిని ఐదు నిమిషాల స్టేజ్ అప్పిరియన్స్ ఇమ్మని అడిగారట. దానికి ఐదు లక్షలు ఇస్తే ఒకే అందట. ఈ మాట వినగానే ముందు సదరు వ్యక్తులు షాక్ అయినా.. ఇప్పుడు తనకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓకే చెప్పారు. నిజానికి తను మొదటి సినిమాగా చేసిన ఆర్ఎక్స్ 100 కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కేవలం 6లక్షలు మాత్రమే. కానీ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ వల్ల కేవలం ఐదు నిమిషాలకే ఐదు లక్షలు అందుకుంది. మరో విశేషం ఏంటంటే.. చాలామంది ముంబై హీరోయిన్లలాగా అక్కడ సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్స్ లో ఉండే భామల బాపతు కాదు పాయల్.. తను చాలా రిచ్.. అసలు తను షూటింగ్ కు వచ్చే విధానానికే ఆత్రేయపురంలో అంతా షాక్ తిన్నట్టు చూసేవారట. ఏదేమైనా హీరోయిన్ కావాలన్న తన కల నెరవేర్చుకున్న పాయల్ ఇక స్టార్డమ్ వేటలో పడింది.

More Related Stories