English   

ఆర్ఎక్స్ 100.. ఎక్క‌డ ఆగుతుంది..? 

RX-100
2018-07-16 09:28:18

చిన్న సినిమాల‌కు లాభాలు రావ‌డం మొద‌లైతే.. నిర్మాత‌ల‌కు లెక్క పెట్టుకోడానికి రోజులు ప‌డుతుంది. అంత‌గా లాభాలు తీసుకొస్తాయి అవి. ఇక ఇప్పుడు మ‌రో సినిమా కూడా ఇలాగే కుమ్మేస్తుంది. దాని పేరు ఆర్ఎక్స్ 100. వ‌చ్చే వ‌ర‌కు కూడా ఈ చిత్రం ఇంత సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. అర్జున్ రెడ్డి గ‌తేడాది ఎలాంటి సంచ‌ల‌నం అయితే సృష్టించిందో ఇప్పుడు క‌లెక్ష‌న్ల ప‌రంగా ఈ చిత్రం కూడా ఇదే చేస్తుంది. రోజుకు క‌నీసం కోటి రూపాయ‌ల‌కు పైగా షేర్ సాధిస్తూ దూసుకెళ్లిపోతుంది. టాప్ గేర్ లో ఉన్న ఈ బండిని ఇప్పుడు ఆప‌డం కూడా క‌ష్టంగానే మారింది. ఈ చిత్రం దెబ్బ‌తో విజేత కానీ.. చిన‌బాబు కానీ క‌నీసం సీన్ లో క‌నిపించ‌డం లేదు. మూడు రోజుల్లోనే 3.79 కోట్ల షేర్ వ‌చ్చింది ఈ చిత్రానికి. రెండోరోజు కంటే మూడో రోజు వ‌సూళ్లు ఇంకా ఎక్కువ‌గా వ‌చ్చాయంటే సీన్ అర్థం చేసుకోవ‌చ్చు. 

ఆదివారం ఇంకా ఎక్కువ వ‌సూళ్లు వ‌స్తాయ‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. బ‌య్య‌ర్ల‌కు ఆర్ఎక్స్ 100తో కాసుల పంట ఖాయం. ఓవ‌ర్సీస్ లో మాత్రం ఈ చిత్రం పెద్ద‌గా ఆడ‌ట్లేదు. అక్క‌డ అర్జున్ రెడ్డిని ఆద‌రించిన వాళ్లు ఈ చిత్రాన్ని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇండియాలో మాత్రం కొత్త వాళ్లు అనే ప‌ట్టింపే లేకుండా ఆర్ఎక్స్ 100 కోసం థియేట‌ర్స్ కు క్యూ క‌డుతున్నారు కుర్రాళ్లు. దానికి కార‌ణం అందులో వాళ్ల‌కు కావాల్సిన కంటెంట్ తో పాటు ముద్దులు హాట్ సీన్స్ కూడా ఉన్నాయి. వాటిని వీక్ నెస్ అంటామో.. లేదంటే ద‌ర్శ‌కుడి తెగింపు అనాలో తెలియ‌దు కానీ ఈ సినిమాతో మాత్రం స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అజ‌య్. కానీ విజ‌యంతో పాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. వాటిని కూడా తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయ‌న‌. అజయ్ తో పాటు హీరో కార్తికేయ‌.. హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ కు కూడా కంగ్రాట్స్ తో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా వ‌స్తున్నాయి. 

More Related Stories