English   

ఆర్ఎక్స్ 100.. సుడి అంటే నీదే రాజా..!

RX-100
2018-07-21 14:36:05

ఓ వారం నాలుగు సినిమాలు విడుద‌లైన‌పుడు క‌చ్చితంగా అందులో ఒక్క‌టైనా బాగుంటుంది క‌దా.. ఆ సినిమా వ‌ల్ల ముందు వారం హిట్టైన సినిమా వ‌సూళ్ల‌కు కాస్తైనా గండి ప‌డుతుంది క‌దా..! కానీ ఇప్పుడు అది జ‌ర‌గ‌డం లేదు. ఆర్ఎక్స్ 100 అదృష్టం హై రేంజ్ లో ఉందిప్పుడు. ఈ వారం వ‌చ్చిన నాలుగు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డేలా క‌నిపించ‌ట్లేదు. దాంతో ఈ వారం కూడా పూర్తిగా ఆర్ఎక్స్ 100 దున్నేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మంచి అంచ‌నాల‌తో వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ల‌వ‌ర్ కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూపించేలా క‌నిపించ‌ట్లేదు. దాంతో రెండో వారం ఆర్ఎక్స్ 100కు మ‌రో 100 థియేట‌ర్స్ యాడ్ చేసారు. ఇప్ప‌టికే ఈ చిత్రం 9.2 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఈ వారం మ‌రో 3 కోట్ల వ‌ర‌కు తీసుకురావ‌డం క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది.

చిన్న సినిమాల‌కు లాభాలు రావ‌డం మొద‌లైతే.. నిర్మాత‌ల‌కు లెక్క పెట్టుకోడానికి రోజులు ప‌డుతుంది. అంత‌గా లాభాలు తీసుకొస్తాయి అవి. ఇక ఆర్ఎక్స్ 100 విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. అర్జున్ రెడ్డి గ‌తేడాది ఎలాంటి సంచ‌ల‌నం అయితే సృష్టించిందో ఇప్పుడు క‌లెక్ష‌న్ల ప‌రంగా ఈ చిత్రం కూడా ఇదే చేస్తుంది. రోజుకు క‌నీసం 80 ల‌క్ష‌ల నుంచి కోటి రూపాయ‌ల‌కు పైగా షేర్ సాధిస్తూ దూసుకెళ్లిపోతుంది. టాప్ గేర్ లో ఉన్న ఈ బండిని ఇప్పుడు ఆప‌డం కూడా క‌ష్టంగానే మారింది. ఈ చిత్రం దెబ్బ‌తో విజేత.. చిన‌బాబు అడ్ర‌స్ లేకుండా పోయాయి. ఇప్పుడు రెండో వారం కూడా కొత్త సినిమాల‌కు ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. 

వీకెండ్ కావ‌డంతో రెండో వారం కూడా వ‌సూళ్లు బ్ర‌హ్మాండంగా వ‌స్తున్నాయి. ఓవ‌ర్సీస్ లో మాత్రం ఈ చిత్రం పెద్ద‌గా ఆడ‌ట్లేదు. అక్క‌డ అర్జున్ రెడ్డిని ఆద‌రించిన వాళ్లు ఈ చిత్రాన్ని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇండియాలో మాత్రం కొత్త వాళ్లు అనే ప‌ట్టింపే లేకుండా ఆర్ఎక్స్ 100 కోసం థియేట‌ర్స్ కు క్యూ క‌డుతున్నారు కుర్రాళ్లు. దానికి కార‌ణం అందులో వాళ్ల‌కు కావాల్సిన కంటెంట్ తో పాటు ముద్దులు హాట్ సీన్స్ కూడా ఉన్నాయి. వాటిని వీక్ నెస్ అంటామో.. లేదంటే ద‌ర్శ‌కుడి తెగింపు అనాలో తెలియ‌దు కానీ ఈ సినిమాతో మాత్రం స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అజ‌య్. కానీ విజ‌యంతో పాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. వాటిని కూడా తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయ‌న‌. అజయ్ తో పాటు హీరో కార్తికేయ‌.. హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ కు కూడా కంగ్రాట్స్ తో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా వ‌స్తున్నాయి. 

More Related Stories