English   

ఆర్ఎక్స్ 100 మోత మామూలుగా లేదుగా..

rx100
2018-07-13 19:33:19

అనూహ్య విజయాలు, ముందే ఊహించిన విజయాలు అంటూ ఉంటాయి. అయితే ఈ రెండూ కాకుండా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ఆర్ఎక్స్ 100. కంప్లీట్ రా మూవీగా అనిపించిన ఆర్ఎక్స్ 100 మోత బాక్సాఫీస్ వద్ద మామూలుగా లేదు. బోల్డ్ కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చదు అనే టాక్ వస్తూనే మరోవైపు కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఆర్ఎక్స్ 100కు ఫస్ట్ డేనే రికార్డ్ కలక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా డే వన్ కలెక్షన్స్ చూస్తే.. ఇప్పటికే పది ఇరవై సినిమాలు చేసిన హీరోలు కూడా ఉలిక్కి పడాల్సిందే. దాదాపు అందరూ కొత్తవాళ్లే చేసిన.. ఒక రకంగా ప్రయోగాత్మక చిత్రం అనదగ్గ ఆర్ఎక్స్ 100 ఫస్ట్ డే ఏకంగా కోటి 42లక్షల షేర్ వసూలు చేసి ట్రేడ్ ను ఆశ్చర్యపరిచింది. 

నిజంగా ఓ కొత్త హీరోకు ఇలాంటి ఫిగర్స్ వెరీ అనెక్స్ పెక్టెడ్. యస్.. ఈ మధ్య గోపీచంద్ వంటి హీరో కూడా ఇంతకంటే ఎక్కువేం సాధించలేకపోయాడు. ఫస్ట్ డే నాలుగు షోస్ కూడా 80పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఈ యంగ్ టీమ్ కు సరికొత్త ఎనర్జీనిచ్చింది. ఆర్ఎక్స్ 100లో అడల్ట్ కంటెంట్ ఉంది. అందమైన ప్రేమకథ ఉంది. ఆకట్టుకోవడానికి కష్టమనిపించే హీరోయిన్ లో కొత్త యాంగిల్ ఉంది.. క్లైమాక్స్ ఊహించలేనిదిగా ఉంది.. ఇన్ని మిక్స్ డ్ అంశాలున్నప్పుడు ఆడియన్స్ కు ఏదో ఒకటి నచ్చాలి. కానీ ఇందులో అన్నీ నచ్చేస్తున్నాయి. అందుకే యూత్ ఈ మూవీకి ఎగబడుతున్నారు. అందుకే అప్పుడే ఈ హీరో టోన్ లో మార్పులు కనిపిస్తున్నాయి. దర్శకుడికి ఆఫర్స్ పెరుగుతున్నాయి. ఏదేమైనా ఫస్ట్ డే ఓ కొత్త హీరో సినిమా కోటి 42లక్షల షేర్ సాధించడం ఈ మధ్య కాలంలో అర్జున్ రెడ్డి తర్వాత ఇదే కావడం నిజం.  

More Related Stories