English   

ప్రివ్యూ: ఆర్ఎక్స్ 100..

RX-100- Movie-Preview
2018-07-11 15:16:13

కొన్ని సినిమాలు మొద‌లుపెట్టిన‌పుడు ఎవ‌రికీ తెలియ‌దు. విడుద‌లకు సిద్ధ‌మైన త‌ర్వాత మాత్రం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోతాయి. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 కూడా ఇలాంటి సినిమానే. దీని గురించి ట్రైల‌ర్ విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. హీరో కొత్త‌వాడు.. హీరోయిన్ కొత్త‌మ్మాయి.. ద‌ర్శ‌కుడు కొత్త‌వాడే.. ఇలా అంతా కొత్త‌వాళ్ల‌తో చేసిన సినిమా అంటే ప్రేక్ష‌కుల‌కు కూడా కొత్తే క‌దా. అందుకే ప‌ట్టించుకోలేదు. ట్రైల‌ర్లో ముద్దు సీన్లు.. హాట్ సీన్ల‌తో సినిమాపై ఆస‌క్తి పుట్టించారు. కార్తికేయ ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతుంటే.. పాయ‌ల్ రాజ్ పుత్ అత‌డితో హాట్ సీన్స్ లో రెచ్చిపోయింది. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌కుడు. రివేంజ్ డ్రామాతో పాటు హాట్ డ్రామాకు కూడా ఇక్క‌డ కొద‌వే లేదు. అందుకే ఆర్ఎక్స్ 100పై ఆస‌క్తి బాగానే ఉందిప్పుడు. రావు ర‌మేష్, రాంకీ లాంటి సీనియ‌ర్ న‌టులు ఇందులో ఉన్నారు. జులై 12న విడుద‌లవుతుంది ఈ చిత్రం. క‌చ్చితంగా ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు కార్తికేయ‌. పైగా అర్జున్ రెడ్డి త‌ర‌హాలో న‌చ్చ‌క‌పోతే రావాల్సిన ప‌నిలేదంటూ డైలాగులు కూడా కొట్టాడు ఈ హీరో. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కాన్ని సినిమా ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌..!

More Related Stories