English   

యమహాపై రైడ్ ఇంట్రెస్టింగ్ గా ఉందే..?

RX-100-Trailer
2018-05-22 12:38:03

కొత్తగా వస్తోన్న కుర్రాళ్లు కొత్త కథలు తేకపోయినా.. ఉన్న కథల్ని కొత్తగా చెబుతున్నారు. లేటెస్ట్ గా వస్తోన్న ‘ఆర్ఎక్స్ 100’ అనే మూవీ ట్రైలర్ కూడా ఇలాగే కనిపిస్తోంది. మొదట్నుంచీ కాస్త సెమీ అడల్ట్ సినిమా అనే లుక్ ఇస్తూ వస్తోన్న టీమ్.. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఇంట్రెస్ట్ పెంచింది. ఈ ట్రైలర్ కు ఫస్ట్ రైడ్ అనే పేరు కూడా పెట్టింది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ ట్రైలర్ లో ఆ శిష్యరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుండటం విశేషం. షాట్ డివిజన్ నుంచి.. టేకింగ్ వరకూ కొత్తగా కనిపిస్తోంది. కథ కూడా ఇంట్రెస్టింగ్ ప్లాట్ లానే ఉంది. కాస్త అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కనిపిస్తోన్నా.. ఇది పూర్తిగా అర్బన్ బేస్డ్ స్టోరీగా కనిపిస్తోంది. ఎలా చూసినా ఈ ‘ఆర్ఎక్స్ 100’ ఫస్ట్ రైడ్ అదిరిపోయిందనే చెప్పాలి. హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. రావురమేష్ కూడా ఉన్నాడు. చూస్తోంటే ఇది అతనికి మరో బెస్ట్ రోల్ అయ్యేలా ఉంది. అలాగే చాలా రోజుల తర్వాత సిందూరపువ్వు ఫేమ్ రాంకీ కూడా రీ ఎంట్రీ ఇచ్చాడీ మూవీతో. అతనికీ కీలక పాత్రే దక్కినట్టు తెలుస్తోంది. ఇతర పాత్రలు కూడా మంచి ఇంటెన్సిటీతో కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే డిఫరెంట్ గా ఉండబోతోందనే విషయం ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ ఈ యమహా ‘ఆర్ఎక్స్ 100’ఫస్ట్ రైడ్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. 

More Related Stories