English   

నటి శ్రావణి ఆత్మహత్య కేసు.. RX100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్టు..

RX 100
2020-09-16 12:51:04

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఆమె చనిపోయిన తర్వాత రోజు నుంచి పోలీసులు తమ ధర్యాప్తు మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావొస్తున్న సాయికృష్ణా రెడ్డితో పాటు దేవరాజ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ3 నేరస్తుడిగా ఉన్న ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ2 గా సాయిరెడ్డి, ఏ3గా నిర్మాత అశోక్ రెడ్డిని రిపోర్టులో చేర్చారు పోలీసులు. ఈ ముగ్గురు కారణంగానే శ్రావణి చనిపోయిందని.. వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే దేవరాజ్ రెడ్డి , సాయిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా విచారించారు. ఇప్పుడు అశోక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈయన స్వయానా హీరో కార్తికేయకు బాబాయ్. కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ఈయన్ని పోలీసులు సెప్టెంబర్ 16న అరెస్ట్ చేశారు . అశోక్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో పోలీసులు 17 మంది సాక్షులను విచారించారు. పోలీసుల అదుపులో ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణలను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఇక సెప్టెంబర్ 14నే విచారణకు వస్తానని చెప్పి పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న నిర్మాత అశోక్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేసారు. 

More Related Stories