English   

ఆర్ఎక్స్ 100.. క‌లెక్ష‌న్ ర‌య్ ర‌య్..

rx100
2018-07-14 16:17:43

చిన్న సినిమాల‌కు ఇప్పుడు పండ‌గే పండ‌గ‌. టార్గెట్ ఆడియ‌న్స్ ను చూసుకుని కోటిలో సినిమా చేసినా ఈజీగా 5 కోట్లు వ‌చ్చేస్తున్నాయి. దానికి నువ్వు చేయాల్సింద‌ల్లా ఎలాంటి కంటెంట్ తో సినిమా చేస్తున్నావు.. ఎవ‌ర్ని టార్గెట్ చేస్తున్నావ్ అనేది మాత్రం ప‌క్కాగా తెలిసుండాలి. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 కు ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్రం యూత్ ను టార్గెట్ చేస్తూ తీసాడు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. అమ్మింది 2.70 కోట్ల‌కు.. ఇప్పుడు రెండు రోజుల్లోనే 2.6 కోట్ల షేర్ వ‌చ్చింది ఈ చిత్రానికి. ఓవ‌ర్సీస్ లో ఊహించిన రెస్పాన్స్ రావ‌ట్లేదు కానీ ఇక్క‌డ మాత్రం సినిమా ఇర‌గ‌దీస్తుంది.

కొత్త వాళ్లు అనే ప‌ట్టింపే లేకుండా ఆర్ఎక్స్ 100 కోసం థియేట‌ర్స్ కు క్యూ క‌డుతున్నారు కుర్రాళ్లు. దానికి కార‌ణం అందులో వాళ్ల‌కు కావాల్సిన కంటెంట్ తో పాటు ముద్దులు హాట్ సీన్స్ కూడా ఉన్నాయి. వాటిని వీక్ నెస్ అంటామో.. లేదంటే ద‌ర్శ‌కుడి తెగింపు అనాలో తెలియ‌దు కానీ ఈ సినిమాతో మాత్రం స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అజ‌య్. కానీ విజ‌యంతో పాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. వాటిని కూడా తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయ‌న‌. అజయ్ తో పాటు హీరో కార్తికేయ‌.. హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ కు కూడా కంగ్రాట్స్ తో పాటు కాంట్ర‌వ‌ర్సీలు కూడా వ‌స్తున్నాయి. 

More Related Stories