English   

అజయ్ భూపతి పేరుతో అమ్మాయిలకి వల...

 RX100
2020-07-04 07:43:50

ఆర్ ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ పేరు తో ఆన్ లైన్ మోసాలు చేస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ అజయ్ భూపతి పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ కొత్త సినిమాలో నటించేందుకు అవకాశాలు ఇప్పిస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. ఫేస్బుక్, ట్విట్టర్ లలో అజయ్ భూపతి పేరుతో ప్రకటనలు ఇచ్చారు. దీంతో ఆయా అకౌంట్లకి కనెక్ట్ అయిన అమ్మాయిలతో సినిమా అవకాశం ఇప్పిస్తానని నేరుగా అమ్మాయిలకు కాల్ చేస్తున్నాడు సదరు వ్యక్తి. అమ్మాయిల ఫోటోలని అజయ్ భూపతి పేరుతో అడుగుతుండడంతో కొందరు  అజయ్ భూపతి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకు వెళ్లారు. దీంతో సోషల్ మీడియాలో తన పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మొద్దని అజయ్ భూపతి తెలిపారు. తన పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు ఆయన. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అజయ్ భూపతి.  అజయ్ భూపతి ఫిర్యాదు పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే బాద్యుడిని పట్టుకుంటామని అన్నారు.

More Related Stories