English   

ఆర్ఎక్స్ 100.. ఇదేం మోతరా బాబోయ్

rx100

హిట్.. ఈ మాట ఇండస్ట్రీకి ఎంత కిక్ ఇస్తుందో వేరే చెప్పక్కర్లేదు. ఇదే మాట ఓ కొత్త బ్యాచ్ కు ఫస్ట్ అటెంప్ట్ లోనే వస్తే.. ఆ కిక్ మామూలుగా ఉండదు. ఆర్ఎక్స్ హండ్రెడ్ బైక్ సౌండ్ లా రయ్ రయ్ మంటుంది. యస్.. లేటెస్ట్ గా విడుదలైన ఆర్ఎక్స్ హండ్రెడ్.. బాక్సాఫీస్ ను ఊపేస్తోంది. ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఓ కొత్త బ్యాచ్ చేసిన ప్రయత్నానికి ఆడియన్స్ కు బ్లాక్ బస్టర్ కట్టబెట్టారు. ఆర్ఎక్స్ హండ్రెడ్.. కంటెంట్ లో నిజాయితీ ఉంటే.. కలెక్షన్స్ సాధించడం ఎంత సులువో ప్రూవ్ చేస్తోన్న సినిమా. అది ఏ జానర్ అయినా చెప్పాలనుకున్న విషయాన్ని హానెస్ట్ గా చెబితే, ఆడియన్స్ కు నచ్చుతుంది. 

వారికి నచ్చిన తర్వాత సినిమా హిట్ కాకుండా ఉంటుందా.. కాకపోతే ఆర్ఎక్స్ హండ్రెడ్ విషయంలో ఇది కాస్త ఆశ్చర్యకరమైన స్థాయికి చేరుకుంది. బోల్డ్ కంటెంట్ అన్నవాళ్లే.. సూపర్ అనేస్తున్నారు. కంటెంట్ ఏదైనా అందులో చూపించిన అంశాలు ఆడియన్స్ కు ఎంత దగ్గరగా ఉన్నాయనేదే ఇంపార్టెంట్ అని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్న హీరోలకూ సాధ్యం కాని రేంజ్ లో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్మురేపిన ఆర్ఎక్స్ హండ్రెడ్ ఈ స్పీడ్ ను ఇంకా పెంచుకుంటూ పోతోంది. 

ఆర్ ఎక్స్ హండ్రెడ్ మూడో రోజు కూడా దుమ్మురేపింది. వీకెండ్ కలిసిరావడంతో పాటు మౌత్ పబ్లిసిటీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాతో సంబంధం లేకుండా మోత మోగిస్తోందీ మూవీ. ఓ చిన్న సినిమాకు.. అది కూడా కొత్తవారికి ఇలాంటి రెస్పాన్స్ రావడం ఈ మధ్య కాలంలో ఇప్పుడే చూస్తున్నాం అంటే అతిశయోక్తి కాదేమో. 
ఇక ఏరియాల వారీగా ఆర్ఎక్స్ హండ్రెడ్ కలెక్షన్స్ చూస్తే.. 

నైజాం 60లక్షలు
సీడెన్ 14.35లక్షలు
ఉత్తరాంధ్ర 16.50లక్షలు
ఈస్ట్ గోదావారి 9.69లక్షలు
 వెస్ట్ గోదావరి 7.03లక్షలు
కృష్ణా 8.13లక్షలు
గుంటూర్ 8.63లక్షలు
నెల్లూర్ 2.8లక్షలు.. 
మూడో రోజు కలెక్షన్స్ ఒక కోటి 26లక్షలు. 
మొత్తంగా మూడు రోజుల్లో ఈ మూవీ 3కోట్ల 76లక్షల షేర్ తో ఎంటైర్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేసింది. అయితే ఈ దూకుడు ఇంకా కంటిన్యూ అవుతుండటమే అసలైన కిక్.. 

More Related Stories