English   

ఆర్ఎక్స్  100 స్పీడ్ ను ఆపేదెవరు..?

rx 100
2018-07-18 22:26:42

ఆర్ఎక్స్  100.. 2018లో టాలీవుడ్ కే షాక్ ఇచ్చిన రేంజ్ హిట్ సాధించిన సినిమా. కలెక్షన్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయే కానీ వీక్ డేస్ లో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఫస్ట్ డేనే కోటిన్నర షేర్ వసూలు చేసిన ఈ ఆర్ఎక్స్ హండ్రెడ్ .. ఇప్పటి వరకూ పదికోట్లకు పైనే గ్రాస్ కలక్ట్ చేసి ఎంటైర్ టాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. పెద్దగా స్టార్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా సాధించిన విజయం కంటెంట్ పై మేకర్స్ ఉండే నమ్మకాన్ని ప్రూవ్ చేసింది. అయితే వీక్ డేస్ కూడా ఊపు మీదున్న ఈ మూవీ స్పీడ్ ను ఆపడానికి ఈ వారం నాలుగు సినిమాలు వస్తున్నాయి. మరి వీటిలో ఎవరు ఆర్ఎక్స్ 100 స్పీడ్ కు బ్రేకులు వేస్తారు.. 

అనీష్ కృష్ణ డైరెక్షన్ లో రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ 20న వస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. కానీ అంచనాలైతే లేవు. ఇక సోషియల్లీ కాన్సియస్ థ్రిల్లర్ గా చెబుతూ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ పై కాస్త అంచనాలున్నాయి. ఈ మూవీ ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో కూడా బెస్ట్ మూవీగా ప్రశంసలు దక్కించుకుంది. కాకపోతే చేస్తోన్న ప్రచారం సరిపోదు. అలాగే ఇది ఓ సెక్టర్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమయ్యే సినిమాగా చెప్పొచ్చు.. 

ఇక అంతా కొత్తవారితో పరిచయం అనే సినిమా వస్తోంది. ఈ సినిమా దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా. ఇది చాలా సెన్సిబుల్ స్టోరీ అనీ.. బట్టలు చింపుకునే ప్రేమకథ కాదంటూ కాస్త ధీమాగా చెబుతోన్న పోస్టర్ లో కనిపిస్తోన్న ఫేస్ లు ఆడియన్స్ ను థియేటర్స్ ఎగబడేలా చేసేవి కావు.. కాబట్టి ఈ సినిమా ప్రభావం భారీగా ఉంటుందనుకోలేం.. 

సెన్సిబుల్ మూవీస్ డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ కాస్త గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఆటగదరా శివ కూడా ఈ 20నే వస్తోంది. అయితే ఈ సినిమాపై పెద్దగా ప్రచారం కనిపించడం లేదు. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఓ పాట విడుదల చేశారు. అయినా హైప్ రాలేదు. కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన సినిమా ఇది. రీమేక్ కూడా. మొత్తంగా ఈ నాలుగు సినిమాలూ డిఫరెంట్ జానర్స్ లో ఉన్నవి. అటు ఆర్ఎక్స్ హండ్రెడ్ యూత్ జానర్ లో ఉన్నది. సో.. మరి  ఈ నాలుగు సినిమాల్లో ఆ బైక్ స్పీడ్ ను ఆపే మొనగాడెవరో చూడాలి. 

More Related Stories