English   

ఆర్ఎక్స్ 100 బైక్ వేలం వేస్తున్నారు

RX-100-Bike
2018-08-22 08:31:45

ఆర్ ఎక్స్ 100.. గత నెలలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా పూర్తిగా కొత్తతరహా కథగా వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ తరహా కథ మనకు ఇంతకు ముందు రాలేదనే చెప్పాలి. అందుకే కాస్త అడల్ట్ కంటెంట్ డోస్ ఎక్కువైనా ఆడియన్స్ ఆదరించారు. మొత్తంగా కలెక్షన్స్ పరంగానూ ట్రేడ్ ను ఆశ్చర్యపరిచిన ఆర్ఎక్స్ 100 టీమ్ ఆ సినిమాలో అత్యంత కీలకంగా కనిపించిన బైక్ ను వేలం వేయబోతోంది.  ఈ యమహా ఆర్ఎక్స్ 100 బైక్ ను వేలం వేయగా వచ్చిన డబ్బులను కేరళ వరద బాధితులకు విరాళంగా అందించబోతున్నారు. అయితే ఈ వేలానికి మినిమం బిడ్ అమౌంట్ 50వేలుగా నిర్ణయించారు. అంటే యాభైవేల నుంచి వేలం పాట మొదలవుతుందన్నమాట. ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు బిడ్డింగ్ ఎమౌంట్ డీటెయిల్స్ ను rx100auction@gmail.com ఈ మెయిల్ ఐడికి పంపించొచ్చు లేదంటే 9100445588 ఈ నంబర్ కు వాట్సాప్ చేయొచ్చు.. 

More Related Stories