English   

మెగా హీరోల ఫ్యూచర్ భలే తేలిందే..?

sai-dharam-tej
2018-02-12 19:53:55

ఒక్క వారం ఇద్దరు మెగా హీరోల ఫ్యూచర్ ను డిసైడ్ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల్ని మార్చేసింది. ఎక్స్ పెక్టేషన్స్ ను మించిన రిజల్ట్ నిచ్చింది. యస్.. మనం మాట్లాడుతున్న సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ గురించే. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత సాయిధరమ్ తేజ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. తానో సుప్రీమ్ హీరో అనే ఫీలింగ్ బాగా ఎక్కేసింది. ఆ క్రమంలోనే శతమానం భవతి వంటి సెన్సిబుల్ మూవీలో నటించే చాన్స్ వస్తే వద్దనుకున్నాడు. తర్వాత కథ తెలిసిందే అతని తిక్కవేశాలు చూడలేక ఆడియన్స్ అతన్ని బాక్సాఫీస్ విన్నర్ వి కాదు అనేశారు. గెస్ట్ రోల్ చేసిన నక్షత్రంలో కూడా చుక్కలే కనిపించాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన ఇంటిలిజెంట్ దర్శకుడు వినాయక్ కావడంతో తేజూ మళ్లీ ఫామ్ లోకి రావడం ఖాయం అనున్నారు. కానీ మనోడు సెకండ్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టాడు. ఇండస్ట్రీలో ఫ్లాపులు కామనే.. కానీ ఇలాంటి ఫ్లాపులు మాత్రమే రేర్. యస్.. తేజూది వాంటెడ్ మిస్టేక్ లా అనిపిస్తుంది. లేకపోతే ఏ మాత్రం బలం లేని కథల్నే రిపీటెడ్ గా ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు.

ఇక ఇంటిలిజెంట్ తో సాయిధరమ్ తేజ్ ఫ్యూచర్ కూడా తేలిపోయింది. అతని కాలిబర్ ఓపెనింగ్స్ కు కూడా పనికిరాదని అర్థమైంది. పా హిట్లు కొత్త విజయాలకు ఎప్పటికీ హెల్ప్ చేయలేవు అని తెలిసిపోయింది. దీంతో ఇకపై చేయబోయే సినిమాల కోసం మెగా టీమ్ రంగంలోకి దిగిందట. చైతూ చేయబోతోన్న సినిమాల్లో హీరోయిజం విషయంలో కోత మొదలైందట. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇతర ఆర్టిస్టుల విషయాల్లోనూ మెగా టీమ్ దగ్గరుండి మరీ చూసుకుంటోందట.  లేదంటే మరో రెండు ఫ్లాపులు పడితే తేజూ పని ఖతమ్ అయిపోవడం ఖాయం.. ఏదేమైనా తేజూకు పూర్తి భిన్నంగా ఉంది వరుణ్ తేజ్ విషయం. 

హీరోగా నిలదొక్కుకుంటాడా.. ఇదీ మొన్నటి వరకూ వరుణ్ విషయంలో వినిపించిన కమెంట్స్. ఫిదా తర్వాత ఫర్లేదనుకున్నా ఆ సినిమా సక్సెస్ లో మేజర్ షేర్ సాయి పల్లవి తీసేసుకుంది. దీంతో అసలు వరుణ్ మెగా స్టార్డమ్ ను మోస్తాడా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా తొలిప్రేమతో ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా సినిమాకూ తనెంత కష్టపడుతున్నాడో చూపించాడు. పైగా ముందు నుంచీ డిఫరెంట్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతోన్న ఈ ముకుందుడు.. మెగా హీరోలంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అన్న కంచెను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అతనికి తొలిప్రేమ తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచిందంటున్నారు. పైగా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మొన్నటి వరకూ వరుణ్ అండ్ సాయిధరమ్ లలో తేజూకే ఎక్కువ క్రేజ్ ఉండేది. అతని క్రేజ్ సినిమా సినిమాకూ తగ్గుతుంటే వరుణ్ తేజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. ఏదేమైనా ఈ ఫ్రైడే ఈ ఇద్దరి హీరోల ఫేట్ స్ట్రాంగ్ గా మార్చేసింది.  

More Related Stories