English   

సాహో : ఒక్క సీన్ కోసం 70 కోట్లా ?

prabhas
2019-07-19 07:48:14

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రన్ రాజ రన్ ఫేం సుజీత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వాయిదా పడనుందని ప్రచారం మొదలయ్యింది. అయితే అందులో నిజం ఎంత ఉందో తెలీదు కానీ, ఈ సినిమా గురించి ఒక  వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఈ సినిమా క్లైమాక్స్ వచ్చే ఫైట్‌ కోసం దాదాపు 70 కోట్ల వ్యయంతో తెరకెక్కించిందట. ఎనిమిది నిమిషాల నిడివితో కూడిన ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ను అబుదాబిలో ఓ ఎడారి సెట్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రష్‌ అవర్‌-3, హెల్‌బోయ్‌తో పాటు పలు హాలీవుడ్‌ సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీని అందించిన పెంగ్‌ ఝాంగ్‌ సారథ్యంలో సుమారు వంద మందికి పైగా విదేశీ ఫైటర్లతో ప్రభాస్‌ తలపడే ఈ సీన్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అయితే ముందుగా ఆగస్ట్‌ 15న సినిమాను విడుదలచేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడినట్లు వార్తలు వచ్చినా వాటిపై దర్శకనిర్మాతలు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికీ సాహో రిలీజ్ డేట్ 15అనే ఉంది. సో సాహో రిలీజ్‌ డేట్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

More Related Stories