English   

ప్రభాస్ ఫ్యాన్స్ కో బ్యాడ్ న్యూస్..

prabhas and prabhas and neilneil

ప్రభాస్ ఫ్యాన్స్ కో బ్యాడ్ న్యూస్.. సాహో సినిమా సంక్రాంతికి రావడం లేదు. అసలు ఈ యేడాదే రావాల్సిన ఈ మూవీ 2019 సంక్రాంతికి వెళ్లిందని కూడా కొందరు ఫీలయ్యారు. కానీ సంక్రాంతికి రావడం కూడా కష్టమే అంటే అభిమానులు ఎలా ఫీలవుతారో కానీ.. ఇప్పుడీ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అసలు ఏ సినిమాకు అయినా రిలీజ్ కు డేట్ కు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని బరిలోకి దిగుతారు. అలాగే సాహో కూడా అన్నీ ప్లాన్ చేసుకుంది. అయితే ప్లాన్స్ వీళ్లు మాత్రమే వేసుకున్నారు. పాజిబిలిటీస్ చూసుకోలేదు. దీంతో అనివార్యంగా సాహో 2019 సమ్మర్ కు వెళ్లొచ్చంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తన్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. బాహుబలితో నేషనల్ వైడ్ గా వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సాహోను త్రిభాషా చిత్రంగానూ తెరకెక్కిస్తున్నారు. సినిమాలో అత్యధికంగా బాలీవుడ్ నటులే కనిపిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో నిండిన సాహోను వివిధ దేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అందులో దుబాయ్ లొకేషన్ ఒకటి. దుబాయ్ లో ఓ భారీ ఛేజింగ్ సీన్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడ రూల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో తెలిసి కూడా అక్కడ ప్లాన్ చేసుకుంది టీమ్. కానీ రోడ్స్ పై ఛేజింగ్ సీన్స్ కు అక్కడి ప్రభుత్వం నుంచి అనుకున్నంత సులువుగా అనుమతులు వచ్చేలా లేవనే న్యూస్ చక్కర్లు కొట్టాయి. అయితే అనుకున్న టైమ్ కు అనుమతులు రాలేదు తప్ప అసలు రాలేదనే న్యూస్ నిజం కాదంటోంది సాహో టీమ్.  మూడు నెలల క్రితం వస్తాయనుకున్న పర్మిషన్ ఈ మధ్యే వచ్చిందనీ, అందుకే కొంత లేట్ అయిందని చెబుతున్నారు. మరి మూడు నెలల కాలం అంటే చిన్నదేం కాదు. అంటే ఆ మూడు నెలలు సినిమా రిలీజ్ డేట్ పైనా ప్రభావం చూపుతాయి. అంటే సినిమా 2019సంక్రాంతికి రావడం దాదాపు అసాధ్యం అనుకోవచ్చు. ఒకవేళ హడావిడీగా రిలీజ్ చేయాలనుకున్నా అవుట్ పుట్ అనుకున్నంత పర్ఫెక్ట్ గా రాదు. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా.. బాహుబలి క్రేజ్ కంటిన్యూ కావడం కష్టమవుతుంది. అందుకే ఎందుకొచ్చిన హడావిడీ అని సమ్మర్ లోనే విడుదల చేద్దాం అనుకుంటోందట సాహో టీమ్. మరి సంక్రాంతా, సమ్మరా అనేది అతి త్వరలోనే తెలుస్తుంది.

More Related Stories