English   

రికార్డ్ క్రియేట్ చేసిన సాహో పోస్టర్ 

Saaho
2019-05-23 09:48:32

బాహుబలి స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా 'సాహో'. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా 250 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమవుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారని ఈ మధ్యే ప్రభాస్ తన కొత్త ఇన్స్టా  గ్రామ్ అకౌంట్ నుంచి సాహో పోస్టర్ ను రిలీజ్ చేశాడు. అయితే సాహో పోస్టర్ ను వదలగా అది వదిలిన 24 గంటలకే ఆ పోస్టర్ ని 7.96 లక్షల మంది లైక్ చేశారు. నిజానికి ఇన్స్టా గ్రామ్ ఫ్లాట్ ఫాంలో ఒక తెలుగు పోస్టర్ ఈ రేంజ్ లైక్స్ ను దక్కించుకోవడం ఇదే మొదటిసారి. నిజానికి ఏప్రిల్ 17వ తేదీన ప్రభాస్ తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేయగా, నెల రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య 1.8 మిలియన్ కి చేరుకుంది. ఈ అకౌంట్ నుంచే ప్రభాస్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే ఫాలోవర్లు సంపాదించడంలో ప్రభాస్ క్రేజ్ బయటపడగా ఈ దెబ్బతో మరో మారు మనోడి క్రేజ్ బయట పడింది. పోస్టర్ లకే ఈరోజు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటే ఇక ఒరిజినల్ సినిమా రిలీజ్ అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ?

More Related Stories