English   

సాహో నెక్ట్స్ షెడ్యూల్ అక్క‌డే..!

Saaho
2018-05-22 16:14:30

ఎన్నాళ్లుగానో క‌ల‌లు కంటోన్న దుబాయ్ షెడ్యూల్ కు గుడ్ బై చెప్పేసారు సాహో టీం. అక్క‌డ్నుంచి వ‌చ్చే ముందు సినిమా విశేషాల‌ను లోక‌ల్ మీడియాతో పంచుకున్నాడు ప్ర‌భాస్. దుబాయ్ షెడ్యూల్ కోసం ఏకంగా 90 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇదిలా ఉంటే ఈ షెడ్యూల్లో 37 కార్లు.. 5 ట్ర‌క్కులు యూజ్ చేసారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు నెక్ట్స్ షెడ్యూల్ ఎక్క‌డ అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ ఉంది. అట్నుంచి అటే సాహో టీం ఇప్పుడు రుమేనియా వెళ్ల‌నున్నారు. అక్క‌డ మ‌రో 20 రోజుల షెడ్యూల్ బాకీ ఉంది. అక్క‌డ కూడా భారీ కార్ ఛేజ్ సీక్వెన్సులు ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఇవి కూడా భారీ ఖ‌ర్చుతో కూడుకున్న‌వే. ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ పై రాన‌టువంటి యాక్ష‌న్ సీక్వెన్సుల‌ను చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కున్ని ఇంత‌గా న‌మ్మడం ఇప్పుడు ఇండియ‌న్ వైడ్ గా చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే బాహుబ‌లి త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో బిజినెస్ రేంజ్ కూడా అలాగే ఉంది అయితే రేపు విడుద‌లైన త‌ర్వాత తెలుస్తుంది సుజీత్ అస‌లు స‌త్తా ఏంటో..? 2019లో విడుద‌ల కానుంది సాహో. అప్ప‌టి వ‌ర‌కు లెట్స్ వెయిట్ అండ్ సీ..!

More Related Stories