English   

సాహొ ట్రైలర్ టాక్....అరాచకం అంటే ఇదే కదా !

 Saaho Trailer
2019-08-10 17:37:11

బాహుబ‌లి సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్ర‌భాస్ నటిస్తున్న తాజా మూవీ సాహో. ఆయన రెండేళ్ళ పాటు చేసిన ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు సహా యావత్ తెలుగు ప్రేక్షక లోకం ఎదురు చూస్తోంది. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా మీద మొదట నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ టీజర్ అయితే ఎక్కడా హాలీవుడ్ రేంజ్ కి తగ్గకుండా ఉంది. ఈ సినిమాలో ఛేజింగ్ సీన్స్ చూస్తే ఇది అసలు ఒక తెలుగు సినిమా అని అనలేము. 2 నిమిషాల 46 సెకన్లున్న ఈ ట్రైలర్ మొదట్లో ముంబయిలో 2000 కోట్ల దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసింది ఎవరు ? హీరో పోలీస్ అనే హింట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కన్ఫ్యూజన్లో పడేశారు. అయితే శ్రద్దా కపూర్ ,మాత్రం సినిమా అమృతా నాయర్ అనే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ పాత్రలో నటించింది. గల్లీలో ఎవరైనా సిక్స్ కొడతాడు. కానీ స్టేడియంలో కొట్టినవాడికే ఓ రేంజ్ ఉంటది అనే డైలాగు హైలైట్. ఈ విజుయల్స్ చూశాక సినిమాకి మూడు వందల కోట్లు కూడా తక్కువే అనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి మీరు కూడా.

More Related Stories