English   

సాక్ష్యం ఎంత ముంచేస్తున్నాడో తెలుసా..? 

Saakshyam-movie
2018-08-04 11:22:46

ప్ర‌తీసారి భారీ సినిమాల‌తో రావ‌డం.. హై బ‌డ్జెట్ కార‌ణంగా బాగున్న సినిమా కూడా ఫ్లాప్ కావ‌డం కామ‌న్ గా జ‌రుగుతుంది బెల్లంకొండ శ్రీ‌నివాస్ కెరీర్ లో. ఈ సారి కూడా సాక్ష్యం అంటూ మ‌రోసారి భారీ సినిమాతోనే వ‌చ్చాడు. కానీ ఇంత‌కుముందు ఈయ‌న సినిమాలు బాగున్నాయి అనే టాక్ వ‌చ్చింది. కానీ ఈ సారి సాక్ష్యం నెగిటివ్ టాక్ తో మొద‌లై.. డిజాస్ట‌ర్ వైపు ప‌రుగులు తీస్తుంది. తొలి వారంలో ఈ చిత్రం కేవ‌లం 9.8 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అందులో 8 కోట్ల‌కు పైగా మూడు రోజుల్లో వ‌సూలు చేసిందే. అంటే వీక్ డేస్ లో పూర్తిగా వీక్ అయిపోయింద‌న్న‌మాట‌. ఈ చిత్ర బిజినెస్  25 కోట్ల‌కు పైగా జ‌రిగింది. ఇది హిట్ అవ్వాలంటే అక్ష‌రాలా పాతిక కోట్లు రావాలి. 

పెట్టిన బ‌డ్జెట్ కంటే త‌క్కువే అమ్మారు నిర్మాత‌లు. అయినా కానీ సాక్ష్యం ఇప్పుడు అందులో స‌గం కూడా తీసుకొచ్చేలా క‌నిపించ‌ట్లేదు. ఇప్ప‌టికే చాలాచోట్ల సినిమా షేర్ ఎండింగ్ కు వ‌చ్చేసింది. తొలివారం ముగిసే స‌రికి సాక్ష్యం కూడా ల‌క్ష్యం అందుకోకుండానే బ‌లైపోయింది. బెల్లంకొండ‌కు కూడా కొద్దోగొప్పో మాస్ ఫాలోయింగ్ తో మూడ్రోజులు ఆడుకున్నాడు కానీ ఆ త‌ర్వాత మాత్రం చుక్క‌లు క‌నిపించాయి. కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్నా.. దాన్ని ప్రేక్ష‌కుల‌కు క‌న్విన్సింగ్ గా చెప్ప‌డంలో విఫ‌లం అయ్యాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్. యాక్ష‌న్ సీక్వెన్సుల‌కు తోడు ఆర్ఆర్ అదిరిపోయినా.. క‌థ‌నం విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే బాగుండు అంటున్నారు. పైగా ఈ వారం వ‌చ్చిన సినిమాల‌కు బాగున్నాయ‌నే టాక్ రావ‌డంతో బెల్లంకొండ‌కు మ‌రో ప్లాప్ త‌ప్ప‌లేదు. ఈ సినిమా త‌క్కువ‌లో త‌క్కువ 13 కోట్ల‌కు పైగానే ముంచేయ‌బోతుంది. 

More Related Stories