English   

సాక్ష్యం.. పంచ‌భూతాల‌తో ప‌య‌నం..!

Saakshyam-trailer

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా లేక‌పోయినా కూడా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. స్టార్ హీరోల సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఈయ‌న సినిమాలు వ‌స్తుంటాయి. ఇప్పుడు కూడా శ్రీ‌వాస్ తో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు ఈ హీరో. దీనికి కూడా 40 కోట్ల‌కు పైగానే బ‌డ్జెట్ పెట్టారు. అల్లుడుశీను ఏకంగా 40 కోట్ల‌తో నిర్మించాడు బెల్లంకొండ సురేష్. ఈ చిత్రం ఓవ‌ర్ బ‌డ్జెట్ కార‌ణంగా ఫ్లాప్ అయింది కానీ ఈ కుర్రాడికి మాత్రం బాగానే గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత స్పీడున్నోడు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ మ‌ధ్యే బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో జ‌య జాన‌కి నాయ‌కా సినిమా చేసాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. ఈ చిత్రం కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ ఈ కుర్రాడి కెరీర్ కు బాగానే హెల్ప్ అయింది. ఇప్పుడు సాక్ష్యంతో ముచ్చ‌ట‌ప‌డుతున్న తొలి హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు బెల్లంకొండ వారి అబ్బాయి.
 
చిన్న‌పుడే అమ్మానాన్న‌ల్ని పోగొట్టుకున్న పాత్రలో న‌టిస్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. త‌న కుటుంబాన్ని నాశ‌నం చేసిన వాళ్ల‌పై ఓ కుర్రాడు తీర్చుకునే ప‌గే ఈ క‌థ‌. దీనికి పంచ‌భూతాలే సాక్ష్యంగా నిలుస్తాయి. అందుకే సాక్ష్యం అని టైటిల్ పెట్టారు. పోరాడినా.. గెలిచినా అన్నింటికీ ఆ పంచ భూతాలే సాక్ష్యం అన్న‌మాట‌. వాటితోనే త‌మ హీరో పోరాటం అంటున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్. ప్రస్తుతం 200 మంది ఫైటర్స్‌తో పీటర్ హెయిన్స్ నేతృత్వంలో కర్నాటక లోని బళ్ళారిలో తెర‌కెక్కించిన యాక్షన్ సీన్స్ ఈ చిత్రంలో హైలైట్. శ్రీ‌వాస్ కు ల‌క్ష్యం.. లౌక్యం.. లాంటి రెండ‌క్ష‌రాల టైటిల్స్ బాగా క‌లిసొచ్చాయి. ఇప్పుడు సాక్ష్యం అంటున్నాడు. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ చూస్తుంటేనే విజువ‌ల్ వండ‌ర్ అని అర్థ‌మైపోతుంది. జులై 27న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి బెల్లంకొండ వార‌సుడు చెప్ప‌బోయే ఆ సాక్ష్యం ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories