English   

‘నువ్ కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామీ..’.. ‘పుష్ప: ది రైజ్’ లిరికల్ సాంగ్‌కు అనూహ్య స్పందన.

Saami song from Pushpa The Rise gets a sensational response
2021-10-28 21:42:35

పుష్ప సినిమా నుంచి మరో పాట విడుదలైంది. మేకర్స్ ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానుల ముందుంచుతున్నారు. దానికి తోడు అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. 

వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా 'సామి సామి' అంటూ సాగే మూడో సింగిల్ వచ్చేసింది. దీనికి కూడా అనూహ్య స్పందన వస్తుంది. పక్కా మాస్ అవతారంలో అటు అల్లు అర్జున్.. ఇటు రష్మిక మందన్న కనిపిస్తున్నారు. న్యాచురల్ లుక్స్‌తో కట్టి పడేస్తున్నారు ఈ ఇద్దరూ. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

అమ్మీ ఏందమ్మీ అట్టా సూత్తండావ్.. ఏందమ్మీ..
నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లానైపోయినట్టుందిరా సామీ.. నా సామీ..
నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ.. నా సామీ..
నీ ఎనకే ఎనకే అడుగేస్తాంటే.. నీ ఎనకే ఎనకే అడుగేస్తాంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామీ..
పక్కాపక్కాన గూసుంటేనే పరమేశ్వరున్ని ఎక్కినట్టుందిరా సామీ..
నువ్ ఎల్లే దారే సూత్తుంటే ఏరే ఎండినట్టుందిరా సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..
సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

పిక్కల పైదాక పంచె నువ్ ఎత్తి కడితే..
పిక్కల పైదాక పంచె నువ్ ఎత్తి కడితే.. నా పంచ ప్రాణాలు పోయేను సామీ..
కార కిల్లి నువ్ కసకస నములుతుంటే నా ఒళ్ళు ఎర్రగ పండెను సామీ..
నీ అరుపులు కేకలు వింటా ఉంటే.. ఏఏఏఏ..
నీ అరుపులు కేకలు వింటా ఉంటే.. పులకరింపులు సామీ..
నువ్ కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామీ..
రెండు గుండీలు విప్పి గుండెలు చూపిత్తే పాల కుండలాగా పొంగిపోతా సామీ.. నా సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..
సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

కొత్తసీర కట్టుకుంటే.. ఎట్టవుందో సెప్పకుంటే.. కొన్న విలువ సున్నా అవ్వదా సామీ..
కొప్పులోన పూలు కొడితే.. గప్పున నువ్ పీల్చుకుంటే పూల గుండె రాలిపడదా సామీ..
కొంగే జారేటప్పుడు నువ్వు.. ఆఆఆఆఆ..
నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటే సామీ.. ఆ కొంటెగాలి నన్నే చూసి జాలిపడదా సామీ..
నా అందం చందం నీదవకుంటే సామీ.. నా ఆడపుటకే పీడైపోదా సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..
సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..
 

More Related Stories