English   

చిరు రికార్డ్ దాటేసిన విక్ర‌మ్.. 

saamy-2

విక్ర‌మ్ కు ఇప్పుడు ఫ్లాపులు ఉన్నాయి కానీ క్రేజ్ ప‌రంగా మాత్రం ఆయ‌న ఇంకా సూప‌ర్ స్టారే. లేక‌పోతే మ‌రేంటి..? ఈయ‌న న‌టిస్తోన్న సామి స్వ్కేర్ పై అంచ‌నాలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ ఇప్పుడు ఏకంగా ఇండియ‌న్ సినిమా రికార్డుల‌నే తిర‌గరాసింది. ఈ చిత్ర మోషన్ పోస్ట‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు 90 వేల లైకులు సాధించింది. ఇండియాలో ఇన్ని లైక్స్ తెచ్చుకున్న మోష‌న్ పోస్ట‌ర్ మ‌రోటి లేదు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి సైరా మోష‌న్ పోస్ట‌ర్ సాధించిన 74 వేల లైకుల‌ను విక్ర‌మ్ అధిగ‌మించాడు. ఇక ఈ మోష‌న్ పోస్ట‌ర్ కు యూ ట్యూబ్ లో 28 ల‌క్ష‌ల 90 వేల వ్యూస్ వ‌చ్చాయి. అయితే ఇక్క‌డ మాత్రం చిరంజీవే నెంబ‌ర్ వ‌న్. ఆయ‌న సైరా 42 ల‌క్ష‌ల వ్యూస్ సాధించింది.. కానీ సామి స్క్వేర్  మాత్రం ఇంకా 29 ల‌క్ష‌ల ద‌గ్గ‌రే ఉంది. లాంగ్ ర‌న్ లో కూడా వ్యూస్ ద‌గ్గ‌ర సైరాను దాట‌డం క‌ష్టం కానీ లైకుల విష‌యంలో మాత్రం మెగాస్టార్ ను బీట్ చేసాడు విక్ర‌మ్. హ‌రి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు మోష‌న్ పోస్ట‌ర్ మే 23 సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. త‌మిళ ట్రైల‌ర్ 26న విడుద‌ల కానుంది. సినిమా ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. 14 ఏళ్ల కింద వ‌చ్చిన సామి సినిమాకు ఇది సీక్వెల్. కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తుంది. 

More Related Stories