English   

ఏ న‌మ్మ‌కంతో అన్నికోట్లు సామి..?

saamy

విక్ర‌మ్ కు తెలుగులో గుర్తింపు ఉంది కానీ మార్కెట్ లేదు. ఈయ‌న సినిమాలు ఇప్పుడు మ‌రీ దారుణంగా బోల్తా కొడుతున్నాయి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌. విక్ర‌మ్ నుంచి హిట్ వ‌చ్చి కొన్నేళ్లైపోతుంది. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతుందంతే. ఇలాంటి టైమ్ లో ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా సామి స్క్వేర్. హ‌రి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దానికి కార‌ణం 14 ఏళ్ల కింద వ‌చ్చిన సామికి ఇది సీక్వెల్ కావ‌డ‌మే. అప్ప‌ట్లో ఆ సినిమా ఓ సంచ‌ల‌నం. అదే తెలుగులో ల‌క్ష్మీన‌ర‌సింహాగా రీమేక్ అయింది. ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్ చేస్తున్నాడు హ‌రి. ఈ చిత్రం తెలుగు హ‌క్కులు ఇప్పుడు షాకింగ్ రేట్ కు అమ్ముడైన‌ట్లు తెలుస్తుంది. బెల్లం రామకృష్ణారెడ్డి.. గిరి సంయుక్తంగా సామి సీక్వెల్ హ‌క్కుల్ని 8 కోట్ల‌కు సొంతం చేసుకున్నారు. అసలు విక్ర‌మ్ సినిమాలు ఇప్పుడు 3 కోట్ల మార్క్ కూడా అందుకోవ‌డం లేదు. అయితే కీర్తిసురేష్ హీరోయిన్ కావ‌డం.. దేవీ సంగీతం.. హ‌రి ద‌ర్శ‌కుడు కావ‌డంతో సామిపై ఆస‌క్తి ఉంది ఇక్క‌డ కూడా. కానీ ట్రైల‌ర్ లో అయితే కొత్త‌ద‌నం ఏమీ క‌నిపించ‌లేదు. మ‌రి ఏ న‌మ్మ‌కంతో నిర్మాత‌లు ఇంత‌గా రేట్ పెట్టి తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకున్నారో వాళ్ల‌కే తెలియాలి..?

More Related Stories