English   

ఆదిపురుష్ అప్డేట్..ఆ జంట‌కు సంగీత బాధ్య‌త‌లు

Sachet and Parampara
2021-06-08 18:08:21

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న సినిమా ఆదిపురుష్. పౌరాణిక రామాయ‌ణం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో నటిస్తుండ‌గా....సీత పాత్ర‌లో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కృతి స‌న‌న్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో విల‌న్ గా రావ‌ణుడి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ముప్పై శాతం పూర్తయ్యింద‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఓ ఇంట‌ర్యూలో వెల్లడించారు. 

అయితే ప్ర‌స్తుతం క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. క‌రోనా ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రాగానే మ‌ళ్లీ సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ సినిమాపై మ‌రో కీల‌క అప్డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాకు సచేత్‌ – పరంపర లు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. స‌చేత్ మ‌రియు ప‌రంప‌ర లు తానాజీ సినిమాలో రెండు పాట‌ల‌కు ట్యూన్ లు ఇచ్చారు. వారు ఇచ్చిన సంగీతం న‌చ్చ‌డంతో ఓం రౌత్ ఆదిపురుష్ కు సంగీతం ఇచ్చేందుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 

More Related Stories