English   

సాహెబ్ వైఫ్ తో సంజూ రొమాన్స్ 

Sanjay-Dutt
2018-07-02 11:32:05

సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్.. సూపర్ హిట్ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ రెండు పార్ట్స్ లోనూ మంచి హిట్ గా నిలిచింది. దీంతో ఈ సిరీస్ లో ఇప్పుడు థర్డ్ పార్ట్ వస్తోంది. అయితే ఈ పార్ట్  స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో గ్యాంగ్ స్టర్ గా మన ఖల్ నాయక్ నటించాడు.. యస్.. గ్యాంగ్ స్టర్ గా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ థర్డ్ పార్ట్ ట్రైలర్ విడుదలైంది. గత రెండు భాగాల్లాగే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే మసాలా డోస్ మరింత పెరిగిందీ సారి. సంజూ భాయ్ కి కూడా మాంచి ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. ఎప్పట్లానే మహిగిల్ మరోసారి రెచ్చిపోయింది. సాహెబ్ కా బివీగా తన పాత్ర అలాగే ఉండటం విశేషం.

ఇక ఫస్ట్ పార్ట్ 2011లో టిగ్మాన్ష్ ధూలియా దర్శకత్వంలో వచ్చింది. అప్పుడు ప్రధాన పాత్రల్లో జిమ్మి షేర్ గిల్, మహిగిల్ తో పాటు రణదీప్ హుడా నటించారు. ఇక ఇదే దర్శకుడు 2013లో దీనికి సీక్వెల్ రూపొందించాడు. సాహెబ్ బివీ ఔర్ గ్యాంగ్ స్టర్ రిటర్న్స్ అంటూ వచ్చిన ఈ మూవీలో ఆ ప్రధాన పాత్రల్లో రణదీప్ ప్లేస్ లో ఈ సారి ఇర్ఫాన్ ఖాన్ వచ్చాడు. అలాగే సోహా అలీఖాన్ కు కూడా మంచి పాత్ర పడింది. ఇక ఇప్పుడు సేమ్ డైరెక్టర్ సిరీస్ లో మూడో భాగం తెరకెక్కించాడు. 

ఈ సారి గ్యాంగ్ స్టర్ గా సంజయ్ దత్ నటించాడు. మిగతా పాత్రలు అలాగే ఉన్నాయి. కంటెంట్ కూడా మాగ్జిమం అదేలా ఉంది. మొత్తంగా లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ గా వచ్చిన సంజూ బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. ఈ టైమ్ లో వస్తోన్న సంజయ్ దత్ డైరెక్ట్ ఫిలిమ్ గా దీనికి ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయనేది నిజం. అందుకోసమే ఈ నెల 27న విడుదల కాబోతోందీ సాహెబ్ బివి ఔర్ గ్యాంగ్ స్టర్ -3. 

More Related Stories